News April 4, 2024
పాసులు ఇవ్వనందుకే కరెంట్ కట్ చేశారు: HCA

SRH-CSK మ్యాచుకు 24 గంటల ముందు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. రూ.1.63 కోట్ల బకాయిలు ఉండటం వల్లే విద్యుత్ సరఫరా నిలిపివేశామని అధికారులు తెలిపారు. అయితే విద్యుత్ అధికారులు మ్యాచ్ పాసులు అడిగారని, ఇవ్వకపోవడంతో కరెంట్ కట్ చేశారని HCA ప్రతినిధులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం జనరేటర్ల సాయంతో స్టేడియంలో లైట్లు వెలిగిస్తున్నారు.
Similar News
News April 4, 2026
విద్యార్థుల నుంచి ఫీజుల్ని వసూలు చేసుకోవచ్చు: హైకోర్టు

TG: ప్రభుత్వం రీయింబర్స్‌మెంటు నిధుల విడుదలలో విఫలమైతే ఇంజినీరింగ్ కాలేజీలు 2026-27లో విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేశాక తిరిగి విద్యార్థులకు ఆ ఫీజుల మొత్తాలను రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు విడుదల చేయకపోవడంపై కాలేజీలు దాఖలు చేసిన 14 పిటిషన్లను విచారించిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
News April 4, 2026
పచ్చి పేడను నేరుగా పొలంలో వేస్తున్నారా?

పశువుల పేడను సరైన విధానంలో వాడితే పంటకు మేలు చేస్తుంది. అయితే చాలా మంది రైతులు పచ్చి పశువుల పేడను నేరుగా పొలంలో చల్లుతుంటారు. దీని వల్ల పంటకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందంటున్నారు నిపుణులు. పచ్చి పేడలో ఉండే నులిపురుగులు మొక్క వేర్లను ఆశించి పంటను దెబ్బతీస్తాయి. అందుకే పేడను మగ్గబెట్టి వాడటం మంచిదని చెబుతున్నారు. దీని వల్ల భూసారం పెరగడంతో పాటు పంట దిగుబడి కూడా బాగుంటుందని చెబుతున్నారు.
News April 4, 2026
పాకిస్థాన్.. మీకు అంత సీన్ లేదులే!

భారత్‌లోకి వచ్చి దాడి చేస్తామన్న పాక్ మంత్రి ఖవాజా <<19562163>>వ్యాఖ్యలు<<>> హాస్యాస్పదంగా ఉన్నాయి. దేశాన్ని నడపడానికి అప్పుల కోసం అల్లాడుతున్న వారికి భారత్ వంటి అగ్రగామి దేశాన్ని ఎదుర్కొనే ఆర్థిక స్తోమత ఎక్కడుంది? అత్యాధునిక ఆయుధ సంపత్తి, టెక్నాలజీ పరంగా ఇండియా ఎంతో ముందుంది. బాలాకోట్, సిందూర్ ఆపరేషన్లే అందుకు నిదర్శనం. పాతకాలపు యుద్ధతంత్రంతో కయ్యానికి కాలు దువ్వితే అది పాక్ పతనానికి నాంది అవుతుంది. మీరేమంటారు?


