News September 17, 2025
మరికొన్ని గంటల్లో మ్యాచ్.. పాక్ ఆడుతుందా?

ఆసియా కప్‌లో పాకిస్థాన్ కొనసాగడంపై ఉత్కంఠ కొనసాగుతోంది. షేక్‌హ్యాండ్ వివాదంలో <<17723523>>పాక్ డిమాండ్<<>>ను ICC తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే UAEతో మ్యాచ్‌లో దాయాది దేశం ఆడుతుందా? టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుందా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రీ మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చేసుకోగానే తప్పుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, తర్వాత నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనడంతో సందిగ్ధత కొనసాగుతోంది.
Similar News
News February 15, 2026
శివరాత్రికి జాగరణ ఎందుకు చేస్తారు?

శివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల భూమిపై సహజంగానే శక్తి ఊర్థ్వ ముఖంగా ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండటం వల్ల ఆ శక్తిని మనం పూర్తిగా గ్రహించవచ్చు. నిద్రను జయించి, రాత్రంతా శివనామ స్మరణ, భజనలు చేయడం వల్ల మనసులోని అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. సినిమాలు లేదా కబుర్లతో కాకుండా, ధ్యానంతో గడిపే జాగరణ మాత్రమే శివతత్వాన్ని మనలో జాగృతం చేసి, మోక్ష మార్గానికి దారితీస్తుంది.
News February 15, 2026
డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్‌లో ఇంటర్న్‌షిప్

<
News February 15, 2026
రైతులకు ద్రోహం చేస్తారా?.. కేంద్రానికి రాహుల్ ప్రశ్నలు

USతో ట్రేడ్ డీల్‌తో కేంద్రం రైతులకు ద్రోహం చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘GM సోయా ఆయిల్, DDG (Distillers Dried Grains) US నుంచి దిగుమతి చేసుకుంటే ఇక్కడి రైతుల పరిస్థితి ఏంటి? వాళ్లు మళ్లీ ధరల షాక్ నుంచి బయటపడగలరా? ఈ డీల్‌లో ఏటా మరిన్ని పంటలు చేర్చుతారా? ఇది తాత్కాలిక ట్రేడ్ ఒప్పందం కాదు.. మన వ్యవసాయ వ్యవస్థపై మరో దేశానికి నియంత్రణ కల్పించడమే. దీనిపై క్లారిటీ ఇవ్వండి’ అని Xలో డిమాండ్ చేశారు.


