News September 17, 2025

హైదరాబాద్ సంస్థానం.. తెలంగాణ ప్రస్థానం

image

8 తెలుగు, 3 కన్నడ, 5 మరాఠీ జిల్లాల సమూహమే హైదరాబాద్ సంస్థానం. దేశంలోని 550 సంస్థానాల్లో అతిపెద్దది. నాడు కోటీ 80 లక్షల జనం ఉంటే ఇందులో 50 శాతం తెలుగువారే. 25 శాతం మరాఠీ, 12 శాతం ఉర్దూ, 11 శాతం కన్నడ, ఇతర భాషాల వారు HYD సంస్థానంలో ఉండేవారు. ప్రపంచంలోనే ధనికుల్లో ‘నిజాం’ ఒకడిగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. 1948 SEP 17న ఈ సంస్థానం ఆపరేషన్‌ పోలో‌తో భారత్‌లో విలీనమైంది. తెలంగాణ ప్రస్థానం మొదలైంది.

Similar News

News September 17, 2025

BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 16 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజినీరింగ్, ఎంఎస్సీ, ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.150. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/

News September 17, 2025

వరంగల్: రజాకార్ల ఆకృత్యాలు.. నెత్తుటి గాథలు!

image

రజాకార్ల పాలనలో ఓరుగల్లు పోరాటాల గడ్డగా నిలిచింది. విమోచన ఉద్యమ చరిత్రలో బత్తిని మొగిలయ్య గౌడ్ వారిపై దండెత్తాడు. బైరాన్‌పల్లి గ్రామం, పరకాల, కూటిగల్, తొర్రూరు కడవెండి, అమ్మాపూర్, నాంచారి మడూర్, జాఫర్‌ఘడ్, మధిర, ఖిలా వరంగల్ కోట వంటి గ్రామాలపై రజాకార్లు విరుచుకుపడి వందలాదిమంది ఉద్యమకారులను కాల్చి చంపారు. ఇప్పటికీ పరకాల, బైరాన్‌పల్లి నెత్తుటి గాథలు అక్కడ ఇంకా సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.

News September 17, 2025

నిర్మల్: అతిథి అధ్యాపకుల వేతన వ్యథలు

image

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న 37 మంది అతిథి అధ్యాపకులకు ఇప్పటివరకు 3 నెలలుగా వేతనాలు రావడం లేదని డిగ్రీ అతిథి అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.సురేందర్ పేర్కొన్నారు. రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ సరైన సమయానికి వేతనాలు రాక ఇబ్బందులకు గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం దసరా పండుగ లోపు బకాయిలు ఖాతాలో జమ చేయాలని కోరారు.