News September 17, 2025
ASF: గంజాయి సాగు.. పదేళ్ల జైలు శిక్ష

గంజాయి సాగు చేసిన నిందితుడికి ASF జిల్లా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వాంకిడి ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాలు.. వాంకిడి మండలం సోనాపూర్‌కి చెందిన జంగు 2022లో అక్రమంగా గంజాయి మొక్కలను సాగు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం జిల్లా కోర్టులో నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి రమేశ్ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు.
Similar News
News September 17, 2025
‘అరబ్-ఇస్లామిక్’ NATO.. భారత్‌కు నష్టమా?

ఖతర్‌పై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ దోహాలో 40కి పైగా అరబ్, ఇస్లామిక్ దేశాలు 2 రోజుల క్రితం సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా <<7824953>>NATO<<>> తరహాలో అరబ్-ఇస్లామిక్ దేశాల మిలిటరీ అలయన్స్‌కు ఈజిప్ట్ ప్రతిపాదించింది. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఏకైక ముస్లిం దేశమైన పాక్ ఇందుకు మద్దతు తెలిపింది. 180 కోట్ల మంది ముస్లింలు ఇదే కోరుతున్నారని పేర్కొంది. కూటమి ఏర్పాటైతే భారత వ్యతిరేక కార్యకలాపాలను పాక్ ఉద్ధృతం చేసే ప్రమాదముంది.
News September 17, 2025
సిరిసిల్ల: నిస్వార్థ నాయకుడు అమృతలాల్ శుక్లా

అమృతలాల్ శుక్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. తొలుత ఉపాధ్యాయ వృత్తిని వదిలి కమ్యూనిస్టు పార్టీలో చేరారు. నిజాం నిరంకుశ పాలనపై పోరాడారు. సామాన్య ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడారు. పేదల కోసం భూ పంపిణీ ఉద్యమాలు, వెట్టిచాకిరి నిర్మూలన కోసం కృషి చేశారు. ఆయన ప్రజల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడారు. 1957లో సిరిసిల్ల MLA గా అమృతలాల్ ఎన్నికయ్యారు.
News September 17, 2025
తుంగతుర్తి: తెగువ చూపి విప్లవాన్ని రగిల్చారు..

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దళ నాయకుడిగా పనిచేసి తెగువతో విప్లవాన్ని రగిలించిన నేత భీంరెడ్డి నర్సింహారెడ్డి. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, సామాజిక న్యాయం కోసం, పేదల బతుకులు బాగు చేసేందుకు ఆయన పోరాడారు. ఆకలిదప్పులు, అసమానతలులేని సమసమాజం నిర్మించాలని పరితపించేవారు. మచ్చలేని పార్లమెంట్ సభ్యుడిగా గడిపిన ఆయన జీవితం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.