News September 17, 2025
తెలంగాణ విమోచన వేడుకల్లో రాజ్ నాథ్ సింగ్

TG: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై.. జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు

ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య పెరిగింది. అయితే హెయిర్‌లాస్ ఎక్కువ ఉంటే బియ్యం కడిగిన నీళ్లతో చెక్ పెట్టొచ్చు. బియ్యం నీటితో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే అమినో ఆమ్లాలు, విటమిన్ బీ, ఈ, సీలు జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. అలాగే రాత్రి బియ్యం నానబెట్టిన నీటిని వడకట్టి ఉదయాన్నే తలకు పట్టించి అరగంట తర్వాత కడుక్కోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
News September 17, 2025
అత్యధిక రెమ్యునరేషన్ ఈ హీరోయిన్లకే!

దక్షిణాదిన అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల వివరాలను ఇండియా టుడే తెలిపింది. నయనతార ఒక్కో సినిమాకు రూ.10+ కోట్లు తీసుకుంటారని పేర్కొంది. అలాగే సాయిపల్లవికి మూవీని బట్టి ₹20కోట్ల వరకు ఉంటుందని, ‘రామాయణ’ కోసం రూ.12కోట్లు డిమాండ్ చేశారంది. నేషనల్ క్రష్ రష్మిక ‘సికందర్’కి ₹13Cr, పుష్ప-2కి ₹10Cr కోట్లు తీసుకున్నారంది. ఇక తమన్న ప్రతి సినిమాకు ₹10కోట్లు వసూల్ చేస్తున్నారని తెలిపింది.
News September 17, 2025
వ్యవసాయం.. అంతర పంటలతో అధిక లాభం

ప్రధాన పంట వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలం వృథా కాకుండా పండించే మరో పంటను అంతర పంట అంటారు. ఈ విధానంలో ఒక పంట దెబ్బతిన్నా.. మరొకటి చేతికొస్తుంది. వాతావరణం అనుకూలిస్తే 2 పంటల నుంచి రైతు మంచి ఆదాయం పొందవచ్చు. దీని వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. కీటకాలు, తెగుళ్లు, కలుపు మొక్కల బెడద, నేలకోత తగ్గి.. భూమిలో పోషకాలు పెరిగే అవకాశం ఉంది. అంతర పంటల సాగు వల్ల వచ్చిన ఆదాయం ప్రధాన పంట పెట్టుబడికి సహాయపడుతుంది.