News September 17, 2025
ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు

APలోని కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో నేడు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. అటు TGలోని హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, నిజామాబాద్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో వానలు పడే ఛాన్సుందని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.
Similar News
News September 17, 2025
ప్రధాని మోదీకి ప్రముఖుల శుభాకాంక్షలు

PM మోదీకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజల సంక్షేమం, వికసిత్ భారత్ కోసం మీ సంకల్పం మాకు స్ఫూర్తి’ అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘రాజకీయాలంటే సేవ అని, అధికారం కాదు త్యాగమని నేర్పిన ప్రధానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని సంజయ్ అన్నారు. PM మోదీకి ఆయురారోగ్యాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ LoP రాహుల్ గాంధీ, TG CM రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
News September 17, 2025
కోళ్లలో పుల్లోరం వ్యాధి – లక్షణాలు

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.
News September 17, 2025
అధరాలు అందంగా ఉండాలంటే..

ముఖ సౌందర్యాన్ని పెంచడంలో పెదవులు కీలకపాత్ర పోషిస్తాయి. కానీ కొందరి పెదవులు నల్లగా ఉంటాయి. వీటిని ఎర్రగా మార్చుకోవడానికి కాస్త తేనె, దానిమ్మరసం కలిపి 5 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేసి, 15 నిమిషాల పాటు అలా వదిలెయ్యాలి. అది ఆరిన తర్వాత చల్లని నీటితో పెదవులను శుభ్రం చేసుకోవాలి. అలాగే గులాబీ రేకులు, పాలు కలిపిన పేస్ట్ పెదవులకు అప్లై చేసినా ఎర్రగా మారతాయి.