News September 17, 2025

HYD: SEP 17.. పేర్లు మార్చిన పార్టీలు!

image

ఆపరేషన్ పోలోలో భాగంగా 1948, SEP 17న HYD సంస్థానం భారత్‌లో విలీనమైంది. ఇది జరిగి 77 ఏళ్లు పూర్తయినా ఏటా కొత్త చర్చనే. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం అని INC, విమోచనమని BJP అధికారికంగా వేడుకలు చేస్తోంది. ఇక సాయుధ పోరాటమని కమ్యూనిస్టులు, జాతీయ సమైక్యత అని BRS-MIM నేతలు వాదిస్తున్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాల మధ్య ‘SEP 17’ రాజకీయ బల ప్రదర్శనకు వేదికవుతోంది. తీరొక్క పేరుతో ఒకే కార్యక్రమం చేయడం గమనార్హం.

Similar News

News September 17, 2025

తురకపాలెంలో జిల్లా కలెక్టర్ పర్యటన

image

గుంటూరు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా బుధవారం తురకపాలెంలో పర్యటించి తాగునీరు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థులు కాచి చల్లార్చిన నీటినే తాగాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. జూన్, జులై నెలల్లో ఎదురయ్యే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు.

News September 17, 2025

NVS రెడ్డి విషయంలో ప్రభుత్వం ఏమంటోంది..?

image

NVS రెడ్డిని HMRL MD పదవి నుంచి తప్పించారనే వాదనను ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. ప్రభుత్వ సలహాదారు (అర్బన్ ట్రాన్స్‌పోర్ట్)గా ఆయన సేవలు ఎక్కువ వినియోగించుకునేలా ప్రమోట్ చేసిందని చెబుతున్నాయి. గతంలో GHMC ట్రాఫిక్ కమిషనర్ లాంటి బాధ్యతలతో పట్టణ రవాణాలో NVSకు అపార అనుభవముంది. ఫోర్త్ సిటీపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఆయన నైపుణ్యాలు వినియోగించుకునేలా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపాయి.

News September 17, 2025

NLR: బాలికతో అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

image

ఉదయగిరికి చెందిన ఓ మహిళ భర్త ఏడాది క్రితం చనిపోయాడు. ఆమెకు కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉంది. నెల్లూరు BVనగర్‌కు చెందిన వెంకటేశ్‌తో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. పిల్లలను బాగా చూసుకుంటానని అతను నమ్మించి కొండాయపాలెంలో ఇంటిని తీసుకున్నాడు. గత నెల 30న కుమార్తెతో కలిసి మహిళ ఈ ఇంటికి వచ్చింది. ఆమె బయటకు వెళ్లిన సమయంలో బాలికతో వెంకటేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. పోక్సో కేసు నమోదైంది.