News April 4, 2024
విజయ్ దేవరకొండ బూతుపై అనసూయ స్పందనిదే..

‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ మాట్లాడిన <<12982348>>బూతు<<>> పదంపై విమర్శలు వస్తున్నాయి. ‘ఇష్టం వచ్చినట్లు వాగడం, తర్వాత తెలంగాణ హీరో మీద విషం చిమ్ముతున్నారని PR మాఫియాతో సింపతీ డ్రామాలు చేయడం, ఇందులో అనసూయను లాగడం’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి అనసూయ స్పందిస్తూ.. ‘ఎవరు ఏ మాఫియా చేస్తున్నారో నేను చాలాసార్లు చెప్పి వదిలేశా. ఈ ట్వీట్‌నూ వారి స్వార్థానికి వాడుకుంటారు’ అని పేర్కొన్నారు.
Similar News
News April 3, 2026
BREAKING: పెరిగిన బంగారం ధర

నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఇవాళ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,960 పెరిగి రూ. రూ.1,50,930కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 ఎగబాకి రూ.1,38,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది.
News April 3, 2026
ECIL, హైదరాబాద్‌లో 32 ఉద్యోగాలు

కాంట్రాక్ట్ ప్రాతిపదికన 32 పోస్టుల భర్తీకి ECIL, హైదరాబాద్.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో ప్రాజెక్ట్ ఇంజినీర్-14, టెక్నికల్ ఆఫీసర్-8, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్-3, సీనియర్ ఆర్టీజన్-7 ఉన్నాయి. సంబంధిత ట్రేడ్‌లో ITI/డిప్లొమా/BE/బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 30-33 మధ్య ఉండాలి. APR- 9,18న ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు www.ecil.co.in చూడండి.
News April 3, 2026
ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగండి: సోనూసూద్

ప్రస్తుతం జరుగుతున్న భారీ <<19527926>>లేఆఫ్స్‌పై<<>> నటుడు సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడం బాధాకరమని, సంక్షోభం నుంచే రేపటి పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగం కోసం వెతకడమే కాకుండా భవిష్యత్తులో కంపెనీలను స్థాపించే దిశగా ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. కష్టాలను అధిగమించి విజేతలుగా ఎదగాలని యువతకు సూచించారు.


