News September 17, 2025
పాలమూరు నిరుద్యోగులకు జాబ్ మేళా

మహబూబ్‌నగర్ జిల్లా నిరుద్యోగుల కోసం దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ కృష్ణ తెలిపారు. ఎస్‌ఎస్‌సీ పాసైన 18 నుంచి 35 ఏళ్ల లోపు నిరుద్యోగులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే ఈ జాబ్ మేళా వివరాల కోసం 93981 72724, 63648 67804, 63648 63213 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
SHARE IT
Similar News
News September 17, 2025
కలెక్టరేట్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు

విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని బుధవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగగా విశ్వకర్మ జయంతి వేడుకలు జరిగాయని కలెక్టర్ తెలిపారు.
News September 17, 2025
NZB: ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది’

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్‌రెడ్డి అన్నారు. NZBలో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు.
News September 17, 2025
రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మిరాయ్’

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. మొదటి 4 రోజుల్లో రూ.91.45 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించగా విశ్వ ప్రసాద్ నిర్మించారు.