News September 17, 2025
HYD: ఆపరేషన్ పోలోకు తక్షణ కారణం ఏంటంటే?

1948 SEP 10న నిజాం UNOలో భారత్‌పై ఫిర్యాదు చేయడంతో ఆపరేషన్ పోలోకు తక్షణ కారణమైంది. భారత్ HYD సంస్థానాన్ని ఆక్రమించబోతోంది, యథాతద ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని అందులో పేర్కొన్నారు. దీనిపై సర్దార్ పటేల్ కఠిననిర్ణయం తీసుకున్నారు. SEP13న బలగాలు HYD వైపు బయలుదేరాయి. SEP 17న నిజాం లొంగిపోయారు. ఒక దేశం మరొక దేశంపై దండెత్తడం చట్టవిరుద్ధమని, సైనిక ఖర్చును వైద్యశాఖ ఖాతాలో వేశారు. HYD సంస్థానం విలీనం అయింది.
Similar News
News September 17, 2025
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాబోయే 3గంటల్లో నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, HYD, జగిత్యాల, జనగాం, BHPL, కామారెడ్డి, KNR, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, PDPL, సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది.
News September 17, 2025
సంగారెడ్డి: పాఠశాలల్లో పేరెంట్-టీచర్ మీటింగ్

ఈ నెల 20న సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాల అభివృద్ధి, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించాలని ఆయన సూచించారు. పీటీఎంకు సంబంధించిన వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు.
News September 17, 2025
స్మార్ట్ కార్డుల్లో పేరు సరిదిద్దాం: జేసీ

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరును స్మార్ట్ కార్డుల్లో చేర్చినట్లు జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందని చెప్పారు. ఇకపై ఏ ఒక్క కార్డును స్కాన్ చేసినా, ‘అంబేడ్కర్ కోనసీమ జిల్లా’ అని కనిపిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అంబేడ్కర్ అభిమానుల మనోభావాలను గౌరవించామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.