News September 17, 2025

NTR: రేపటితో ముగియనున్న ఉద్యోగాల దరఖాస్తు గడువు

image

APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన 5 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, గ్రూప్ డైరెక్టర్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్, టీం లీడర్(MIS) పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తున్నట్లు కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. అభ్యర్థులు SEP18లోపు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్నారు. విద్యార్హతలు, వేతనం వివరాలకు పై వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.

Similar News

News September 17, 2025

MLC తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

image

TG: రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. MLC చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’(TRP) పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పలువురు బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదాలతో పార్టీ ఆవిర్భవించినట్లు మల్లన్న తెలిపారు. వచ్చే అన్ని ఎన్నికల్లో TRP పోటీ చేస్తుందని వెల్లడించారు.

News September 17, 2025

బాపట్లలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్

image

ఆరోగ్యకరమైన మహిళలు – బలమైన కుటుంబం లక్ష్యంతో చేపట్టిన స్వస్త్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం బాపట్లలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు ఆరోగ్య పరిక్షలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు.

News September 17, 2025

రాజమండ్రి: పీఎం ఆవాస్ యోజన బ్రోచర్ ఆవిష్కరణ

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ 2.0 అంగీకార బ్రోచర్‌ను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా అర్హులైన పేదలకు సొంత ఇంటి కల సాకారమవుతుందని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు అక్టోబరు 31 లోగా తమ అంగీకారాన్ని తెలియజేయాలని ఆమె కోరారు.