News September 17, 2025

ADB: రాంజీ గోండ్.. అడవిలో అడుగులేసిన విప్లవం

image

బ్రిటిష్, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన వీరుడు రాంజీ గోండ్. ఆయన 1857 భారత స్వాతంత్ర్య సంగ్రామం కంటే ముందే నిర్మల్, ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల్లో గిరిజనులను సమీకరించి, స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అటవీ హక్కులను కాలరాస్తున్న పాలకులకు వ్యతిరేకంగా ఆయన గెరిల్లా యుద్ధం నడిపారు. ​1860లో బ్రిటిష్ సైన్యాలు రాంజీ గోండ్, ఆయనతో పాటు దాదాపు 1000 మంది అనుచరులను పట్టుకొని నిర్మల్‌లోని ఒక మర్రిచెట్టుకు ఉరితీశారు.

Similar News

News September 17, 2025

పెద్దపల్లి ఆసుపత్రిలో హెపటైటిస్ బీ టీకా కార్యక్రమం ప్రారంభం

image

పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి హెపటైటిస్ బీ నిరోధక టీకా కార్యక్రమాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ప్రారంభించారు. రక్తం, శరీర ద్రవాల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వైద్య సిబ్బందికి సోకే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. రక్షణ చర్యగా జీరో డోస్ తర్వాత నెలకు ఒకటి, ఆరు నెలలకుపైగా మరో డోస్ తీసుకోవాలని సూచించారు.

News September 17, 2025

గోదావరిఖని నుంచి బీదర్‌కు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు

image

GDK RTC డిపో ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఈ నెల 25వ తేదీ రాత్రి 10 గంటలకు బీదర్‌కు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. ఈ ట్రిప్‌లో భక్తులు బీదర్ జల నరసింహస్వామి, రేజింతల్, జరసంగమం పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని DM నాగభూషణం తెలిపారు. ఈ యాత్ర 26వ తేదీ రాత్రికి GDK తిరిగి చేరుకుంటుంది. టికెట్ ₹1,600గా ధర నిర్ణయించారు. టిక్కెట్ల రిజర్వేషన్ కోసం 7013504982 నంబర్‌ను సంప్రదించవచ్చు.

News September 17, 2025

ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రి సురేఖ

image

వరంగల్ ఓ సిటీ IDOC మైదానంలో ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ అతిధిగా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.