News September 17, 2025

పాకిస్థాన్ మ్యాచులకు రిఫరీగా రిచర్డ్‌సన్!

image

ఆసియా కప్: షేక్‌హ్యాండ్ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ని తొలగించాలని పాకిస్థాన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను ఆసియా కప్ నుంచి తొలగించకపోతే తాము UAEతో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ మ్యాచులకు పైక్రాఫ్ట్‌ను ICC దూరం పెట్టినట్లు తెలుస్తోంది. UAEతో మ్యాచ్‌కు రిఫరీగా రిచర్డ్‌సన్‌ను నియమించినట్లు PCB సభ్యుడు చెప్పారని PTI కథనం ప్రచురించింది.

Similar News

News September 17, 2025

24న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

image

AP: డిసెంబర్ కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు ఈనెల 24న ఉదయం 10గంటలకు విడుదల కానున్నాయి. మ.3 గంటలకు అదే నెలకు సంబంధించిన వసతి బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. భక్తులు దళారులను నమ్మవద్దని, <>ttdevasthanams.ap.gov.in<<>> వెబ్‌సైట్ లేదా యాప్‌లోనే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

News September 17, 2025

నటికి రూ.530 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్?

image

హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీకి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. హయ్యెస్ట్ బడ్జెట్‌‌తో రూపొందనున్న ఓ సినిమాలో నటించేందుకు ఆమెకు ఏకంగా రూ.530కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఇది జరిగితే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా సిడ్నీ నిలువనున్నారు.

News September 17, 2025

MLC తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ

image

TG: రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. MLC చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’(TRP) పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పలువురు బీసీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదాలతో పార్టీ ఆవిర్భవించినట్లు మల్లన్న తెలిపారు. వచ్చే అన్ని ఎన్నికల్లో TRP పోటీ చేస్తుందని వెల్లడించారు.