News April 4, 2024
1962లోనే 38వేల చ.కి.మీ భూమిని కోల్పోయాం: జైశంకర్

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటోందని ఇండియా కూటమి చేస్తోన్న విమర్శలను విదేశాంగ మంత్రి జైశంకర్ ఖండించారు. 1962లోనే 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయామని చెప్పారు. 2000 తర్వాత ఆక్రమణ జరిగిందని ఆరోపించడం సరి కాదన్నారు. పాక్, చైనాను మినహాయిస్తే మిగతా పొరుగుదేశాలతో భారత సంబంధాలు గతంలో కంటే మెరుగ్గానే ఉన్నాయని తెలిపారు. POK ఎప్పటికీ భారత్‌లో భాగమేనని స్పష్టం చేశారు.
Similar News
News April 2, 2026
క్రికెట్‌కు సౌతాఫ్రికా ప్లేయర్ గుడ్‌బై

సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్‌డెర్ డసెన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రొటీస్ బోర్డుకు, సహచర ఆటగాళ్లకు, అండగా నిలిచిన కోచ్‌లు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 37 ఏళ్ల డసెన్ SA తరఫున 71 వన్డేల్లో 2,657 పరుగులు, 57 టీ20ల్లో 1,406, 18 టెస్టుల్లో 905 రన్స్ చేశారు. 2022 IPLలో RR తరఫున, SA లీగ్‌లో MI కేప్‌టౌన్ తరఫున ఆడారు.
News April 2, 2026
నా భూమి లాక్కున్నారు.. నటి సోనాలిపై రైతు కేసు!

సీనియర్ నటి సోనాలీ బింద్రే, ఆమె భర్త గోల్డి బెహల్ తన 30 గుంటల భూమిని ఆక్రమించారంటూ పుణేకు చెందిన రైతు చంద్రకాంత్ పోలీసులను ఆశ్రయించారు. ఆ భూమి 1957 నుంచే వంశపారంపర్యంగా వస్తోందని, తనను బెదిరించి ఆక్రమించారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే తాను చట్టబద్ధంగానే ఆ భూమిని కొనుగోలు చేశానని సోనాలి చెబుతున్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారని, కోర్టులో తేల్చుకుంటానని తెలిపారు.
News April 2, 2026
గుండెల మీద ఆడించిన తండ్రే.. కర్కశంగా చంపేశాడు!

AP: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో ఉంటానని కూతురు చెప్పడాన్ని తండ్రి తట్టుకోలేకపోయాడు. ఆమె గుండెలపై కూర్చొని ఊపిరాడకుండా చేసి, ఆపై ఉరేసి చంపాడు. మాచర్లకు చెందిన చౌడేశ్వరి(22), అదే మండలానికి చెందిన నాగరాజు గత నెల 4న ఇల్లు విడిచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులకే మాట్లాడుకుందామని పెద్దలు వారిని మాచర్ల తీసుకురాగా 18న హత్య జరిగింది. పోలీసులు నిన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


