News April 4, 2024

అకౌంట్లో రూ.18,750 పడ్డాయా?

image

AP: వైఎస్సార్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.18,750 అందిస్తోంది. నెల రోజుల క్రితం అంటే మార్చి 7న సీఎం జగన్ బటన్ నొక్కి 4వ విడత నిధులను విడుదల చేశారు. కొందరికి డబ్బులు రాగా, ఇంకా తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వల్లే జాప్యం జరుగుతోందని కొందరు, నోటిఫికేషన్‌కు ముందే బటన్ నొక్కారని మరికొందరు గుర్తుచేస్తున్నారు.

Similar News

News April 9, 2026

సొంత ఇల్లు, కారు లేవు.. దేశంలోనే పేద సీఎం మమత!

image

తనకు సొంత ఇల్లు, కారు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. 9.8 గ్రాముల బంగారం, రూ.75,700 నగదు ఉందని తెలిపారు. మొత్తంగా రూ.15.37 లక్షల ఆస్తులు ఉన్నట్లు ప్రస్తావించారు. దీంతో దేశంలో పేద సీఎంగా మమత నిలిచారు. ఆమె తర్వాతి స్థానాల్లో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(రూ.55 లక్షలు), కేరళం సీఎం పినరయి విజయన్(రూ.కోటి) ఉన్నారు.

News April 9, 2026

దాహమేస్తోందని అడగలేవు.. మనమే దప్పిక తీరుద్దాం!

image

ఎండాకాలంలో జంతువులు నీడ, నీరు లేక అల్లాడిపోతాయి. దాహమేస్తోందని అడగలేవు కూడా. అందుకే వాటి బాధను మనం అర్థం చేసుకుందాం. ఇందుకోసం మీరు చేయాల్సింది ఇంటి ముందర చిన్న తొట్టె లేదా బకెట్లో నీళ్లు నింపి పెట్టడమే. మండే ఎండల్లో దాహంతో ఉన్న పక్షులు, జంతువులు ఆ నీటితో కడుపు నింపుకుంటాయి.
Share It

News April 9, 2026

పురుషులకు ప్రవేశం లేని ఆలయాలూ ఉన్నాయ్: కేంద్రం

image

శబరిమలలోకి 10-50 ఏళ్ల మహిళల ప్రవేశంపై ఆంక్షలను కేంద్రం సమర్థించింది. ఇది వివక్ష కాదని, దశాబ్దాలుగా కొనసాగుతున్న <<19599264>>ఆచారాన్ని<<>> గౌరవించడమేనని తెలిపింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ వాదనలు వినిపించారు. దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలూ ఉన్నాయని చెప్పారు. కాబట్టి ఇది పురుషాధిక్య/ స్త్రీ ఆధారిత విశ్వాసాలకు సంబంధించింది కాదన్నారు.