News September 17, 2025
సిరిసిల్ల: సాయుధ పోరాట యోధుడు సింగిరెడ్డి భూపతి రెడ్డి

తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సింగిరెడ్డి భూపతి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటూ మహాసభలో పాల్గొన్నారు. ఈయన 1930లో తహశీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేసారు. అక్కడ జరిగే దుర్మార్గాలను సహించలేక పూర్తి కాలం కార్యకర్తగా తనతోపాటు అనేకమందిని ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ ముందుకు సాగారు. మహమ్మదాపూర్ గుట్టల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఈయన తుది శ్వాస విడిచారు.
Similar News
News September 17, 2025
నర్సంపేట: నేషనల్ స్పేస్ సొసైటీలో నిహారిక ఫస్ట్..!

నర్సంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న భూక్య నిహారిక నేషనల్ స్పేస్ సొసైటీ (USA) నిర్వహించిన “Road Map to Space Art Contest” డ్రాయింగ్ విభాగంలో ప్రపంచ స్థాయి మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా నర్సంపేట MLA దొంతి మాధవ రెడ్డి భూక్య నిహారికను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
News September 17, 2025
రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయండి: KMR కలెక్టర్

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నుంచి చుక్కాపూర్, మాచారెడ్డి మీదుగా బండ రామేశ్వరంపల్లి వరకు ఉన్న రోడ్డు మరమ్మతులను ఆయన సమీక్షించారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆయన ఆదేశించారు.
News September 17, 2025
భార్య కాపురానికి రాలేదని కత్తితో దాడి

కుప్పం (M) బైరప్ప కొటాలకు చెందిన కీర్తి(18)కి రెండేళ్ల కిందట తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన రాజేష్‌తో వివాహమైంది. ఐదు నెలల కిందట డెలివరీ కోసం ఆమె పుట్టింటికి వచ్చి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టి నాలుగు నెలలు కావస్తున్నా భార్య కాపురానికి రాలేదని, తనతో సరిగ్గా మాట్లాడటం లేదని మనస్థాపనానికి గురైన రాజేష్ తన భార్య గొంతు కోసి, ముఖంపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.