News September 17, 2025
జగిత్యాల కలెక్టరేట్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

జగిత్యాల కలెక్టరేట్ లో బుధవారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ బి ఎస్ లత లు నిరంజన్ రెడ్డికి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా సాధించిన ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రసంగించారు.
Similar News
News September 17, 2025
మోదీ పుట్టినరోజు.. లండన్‌లో పూజలు చేసిన మంత్రి లోకేశ్

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, మంత్రి నారా లోకేశ్ లండన్‌లోని ఇస్కాన్ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేశారు. మోదీకి దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతుడిని వేడుకున్నానని లోకేశ్ తెలిపారు. మోదీ మార్గదర్శకత్వంలో ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నారు.
News September 17, 2025
SPMVV ఫలితాలు విడుదల

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఆగస్టు నెలలో పీజీ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్ MBA (మీడియా మేనేజ్మెంట్) 2వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలైనట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
News September 17, 2025
బ్యాంకింగ్ రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయండి: జేసీ

జిల్లాలోని రైతులకు పంట రుణాలు, మహిళా గ్రూపులు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, యువత ఉపాధి రంగానికి అవసరమైన రుణాలను తక్షణమే మంజూరు చేయాలని జేసీ విష్ణు చరణ్ బ్యాంకర్లను సూచించారు. కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం రూ.15,120 కోట్ల వార్షిక రుణ లక్ష్యానికి గాను జూన్ 30 నాటికి రూ.5,360 కోట్లు మాత్రమే సాధించారన్నారు.