News September 17, 2025
‘పార్వతీపురం జిల్లాలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు’

జిల్లాలో బలహీన వర్గాలు మరియు మధ్యతరగతి కుటుంబాల అవసరాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ పిజిఆర్ఎస్ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం అంగీకార అమలుపై అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ విధానంపై ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాలని పేర్కొన్నారు.
Similar News
News September 17, 2025
భీమదేవరపల్లి: విష జ్వరంతో చిన్నారి మృతి

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి విష జ్వరంతో మృతి చెందింది. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి చిన్నారి మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News September 17, 2025
నిర్మల్: ఆకాశం ఎందుకో ఎర్రబడ్డది..!

సూర్యాస్తమయ సమయంలో ప్రకృతి సంతరించుకునే రంగులు ముచ్చట గొలుపుతాయి.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. బుధవారం సంధ్య వేళ సూర్యుడు అస్తమిస్తుండగా ఏర్పడిన అరుణవర్ణం చూపరులకు ఆహ్లాదం పంచింది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం గుండంపల్లి ప్రధాన రోడ్డు పక్కన నుంచి వెళ్తుండగా టెంబుర్ని పెద్ద చెరువు మీదుగా కనిపించిన ఈ దృశ్యం చూసే వారికి ఆహ్లాదం పంచింది.
News September 17, 2025
నిజాంసాగర్: మంజీర నదిలో వ్యక్తి గల్లంతు

నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ సమీపంలోని నాగమడుగు వద్ద మంజీర నదిలో ఓ వ్యక్తి గల్లంతైన ఘటన బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. బంజపల్లికి చెందిన వడ్ల రవి(42) నాగమడుగు ప్రాంతంలో కాలకృత్యాల కోసం వెళ్లాడు. అయితే, వరద నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.