News April 4, 2024
మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి ఈసీ నోటీసులు

AP: చంద్రబాబే పింఛన్లు ఆపారంటూ మంత్రి జోగి రమేశ్ ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. అలాగే వాలంటీర్ల సేవల నిలిపివేతకూ చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు చేసిన ట్వీట్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. దీంతో జోగి రమేశ్‌తో పాటు ఎమ్మెల్సీ, ఆ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డికి ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.
Similar News
News February 11, 2026
T20WC: ఒకే ఓవర్లో 6, 4, 4, 0, 6, 4

వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఏకంగా 24 రన్స్ రాబట్టారు. బాల్ బై బాల్ రన్స్ చూస్తే 6, 4, 4, 0, 6, 4. ఆపై షఫర్డ్ బౌలింగ్‌లో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటై పెవిలియన్‌కు చేరారు. తొలుత బ్యాటింగ్ చేసిన WI 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
News February 11, 2026
VIRAL: రైలులో గణేశుడి ఆలయం.. తెలుసా?

బిహార్‌లోని జయనగర్ నుంచి అమృత్‌సర్ వెళ్లే భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఒక అరుదైన దృశ్యం కనిపిస్తుంది. ఇందులోని S-1 కోచ్‌లో 37వ నంబర్ బెర్త్‌ను గణేశుడికి కేటాయించారు. అక్కడ ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గత 12 ఏళ్లుగా ప్రయాణికులు ఎవరూ ఈ బెర్త్‌ను బుక్ చేసుకోకుండా దేవుడికే వదిలేస్తున్నారు. ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుకుంటూ భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం విశేషం.
News February 11, 2026
T20 WC: తడబడి నిలబడిన విండీస్

ఇంగ్లండ్‌తో మ్యాచులో వెస్టిండీస్ 196/6 రన్స్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 8 పరుగులకు 2.. 77 రన్స్‌కు 4 వికెట్లు కోల్పోయింది. దీంతో WI తక్కువ స్కోర్‌కే చాప చుట్టేస్తుందని అనుకున్నారు. కానీ రూథర్‌ఫోర్డ్ 76, ఛేజ్ 34, హోల్డర్ 33 రన్స్‌తో రాణించడంతో 200 మార్క్‌కు చేరువైంది. ENG బౌలర్లలో రషీద్, ఓవర్టన్ చెరో 2 వికెట్లు తీశారు.


