News April 5, 2024

9న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Similar News

News March 1, 2026

చిత్తూరు: HPV వ్యాక్సిన్‌పై అవగాహన

image

సర్వైకల్ క్యాన్సర్ వ్యాపించకుండా 14 ఏళ్లలోపు బాలికలకు ఉచిత HPV వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న సర్వేలో 4185 మంది క్యాన్సర్ అనుమానితులను గుర్తించారు. ఈ వ్యాక్సిన్ 18,500 మంది బాలికలకు అందించాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు.

News March 1, 2026

చిత్తూరు: చెత్త ఇస్తే డబ్బులు.. ఎంతో తెలుసా.?

image

పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛ రథాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం నెలలో ఒకరోజు పంచాయతీల పరిధిలో ఈ వాహనం పర్యటిస్తుందని అధికారులు తెలుపుతున్నారు. వాహనాలకు అందజేస్తే పాత ఇనుముకు కేజీ రూ. 20, అల్యూమినియం రూ. 120, స్టీల్ రూ.40, పేపర్లు రూ.15, పుస్తకాలు, అట్టపెట్టెలు రూ.10, ప్లాస్టిక్ రూ.20 చొప్పున చెల్లిస్తారని పేర్కొంటున్నారు.

News March 1, 2026

చిత్తూరు జిల్లాలో 93% పింఛన్ల పంపిణీ

image

జిల్లాలో శనివారం 93.10 శాతం మేర ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. 2,33,419 మందికి గాను తొలి రోజున 2,17,324 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు అందజేశామన్నారు. మార్చి ఒకటిన ఆదివారం సెలవు కావడం తో, 2న సోమవారం మిగిలిన 16,095 మందికి పింఛన్లు అందించనున్నట్లు పీడీ పేర్కొన్నారు.