News September 18, 2025
మధ్యాహ్నం రెండు గంటలలోపు రిపోర్ట్ చేయండి: DEO

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మెగా డీఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులందరూ సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల లోపు గుంటూరులోని ఆంధ్ర ముస్లిం కళాశాలలో తప్పనిసరిగా రిపోర్టు చేయాలని డీఈవో చంద్రకళ సూచించారు. బుధవారం మాట్లాడుతూ.. ఎంపికైన ఉపాధ్యాయులకు అమరావతిలో 19వ తేదీన సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారని పేర్కొన్నారు. రిపోర్టు చేసిన ఉపాధ్యాయులకు ఐడీ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
Similar News
News September 18, 2025
KNR: ఏళ్ల తర్వాత RTCలో JOBS.. DON’T MISS ఛాన్స్!

కరీంనగర్ RTC రీజియన్ పరిధిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 64 పోస్టుల భర్తీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కరీంనగర్‌లో 19, పెద్దపల్లిలో 16, జగిత్యాలలో 18, సిరిసిల్లలో 11 చొప్పున ఖాళీలను నింపనున్నారు. అక్టోబర్ 8 నుంచి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు, జీతభత్యాల కోసం <<17746081>>ఇక్కడ CLICK<<>> చేయండి. #SHARE IT.
News September 18, 2025
చిత్తూరు: రెండేళ్ల క్రితం హత్య.. ఇప్పుడు వెలుగులోకి

బంగారుపాళ్యం(M) బలిజపల్లికి చెందిన చెంచులక్ష్మి భర్త చనిపోగా శేషాపురానికి చెందిన దేవేంద్రతో వివాహేతర బంధం ఏర్పడింది. పెనుమూరు(M) సామిరెడ్డిపల్లిలోని ఓ మామిడి తోటలో కాపలా పనికి 2023లో ఇద్దరు వచ్చారు. అప్పట్లోనే వాళ్ల మధ్య గొడవ జరగ్గా చెంచులక్ష్మిని దేవేంద్ర నీటిలో ముంచి చంపేశాడు. తోటలోనే డెడ్‌బాడీని పాతిపెట్టి ఆమె ఎటో వెళ్లిపోయిందని మృతురాలి తల్లిని నమ్మించాడు. పోలీసులు నిన్న అతడిని అరెస్ట్ చేశారు.
News September 18, 2025
ఎటపాక: స్కూ డ్రైవర్ బిట్‌ను మింగేసిన బాలుడు

ఎటపాకలోని చోడవరానికి చెందిన గౌతమ్ (8) బుధవారం ఆడుకుంటూ స్క్రూ డ్రైవర్‌ను మింగేశాడు. తీవ్రమైన కడుపునొప్పితో అల్లాడుతుండగా కుటుంబీకులు ఆసుపత్రికి తరలించారు. అది పేగులో అడ్డం తిరగడంతో భద్రాచలం ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేసి బిట్‌ను బయటకు తీశారు. దీంతో బాలుడు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డాడు.