News September 18, 2025
మక్దూంపూర్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. మక్దూంపూర్ 39.8మి.మీ, బొమ్మన్ దేవిపల్లి 33.3, బీర్కూరు,ఆర్గొండ లలో 15, నస్రుల్లాబాద్ 13.5, పిట్లం 13, జుక్కల్ 12.5, సోమూర్ 10, మేనూరు 9.5, హాసన్ పల్లి 8.3, కొల్లూరు 7.5, తాడ్వాయి 6.5, పాత రాజంపేట 4.8, ఇసాయిపేట 3.3, బిచ్కుంద 3మి.మీ లుగా రికార్డ్ అయ్యాయి.
Similar News
News September 18, 2025
పాలు పితికే సమయంలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పాలు పితకడానికి ముందు గేదె/ఆవు పొదుగు, చనులను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పాలు పితికే వ్యక్తి చేతులకు గోళ్లు ఉండకూడదు. చేతులను బాగా కడుక్కొని పొడిగుడ్డతో తుడుచుకున్నాకే పాలు తీయాలి. పొగ తాగుతూ, మద్యం సేవించి పాలు పితక వద్దు. పాల మొదటి ధారల్లో సూక్ష్మక్రిములు ఉంటాయి. అందుకే వేరే పాత్ర లేదా నేలపై తొలుత పిండాలి. పాలను సేకరించే పాత్రలను శుభ్రంగా ఉంచకపోతే తీసిన పాలు త్వరగా చెడిపోతాయి.
News September 18, 2025
మహిళా వ్యాపారవేత్తల కోసం ట్రెడ్ స్కీమ్

మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటే ట్రెడ్. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇందులో మహిళలకు తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావాల్సిన రుణం, శిక్షణ వంటి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30 శాతం వరకు ప్రభుత్వం గ్రాంట్ కింద అందజేస్తుంది. మొత్తం రూ.30 లక్షల వరకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి.
News September 18, 2025
సంగారెడ్డి: 20న ఉమ్మడి జిల్లా స్విమ్మింగ్ ఎంపికలు

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్విమ్మింగ్ ఎంపికలు ఈనెల 20న సంగారెడ్డిలోని స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. బాలబాలికల అండర్- 14, 17 ఎంపికలు జరుగుతాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం 9494991828 నెంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.