News April 5, 2024
ఏలూరు జిల్లాలో 90% పెన్షన్ల పంపిణీ: డీఆర్డీఏ పీడీ

ఏలూరు జిల్లాలో 2,70,804 లబ్ధిదారులు ఉండగా గురువారం రాత్రి 8 గంటల వరకు 2,43,795 మందికి సామాజిక పెన్షన్ల పంపిణీ జరిగిందని డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు వెల్లడించారు. పెన్షన్ పంపిణీ నిమిత్తం జిల్లాకు రూ.80.92 కోట్లు విడుదలయ్యాయని అన్నారు. ఇంతవరకు రూ.73.89 కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో గురువారం వరకు 90 శాతం పెన్షన్ల పంపిణీ జరిగిందన్నారు.
Similar News
News November 6, 2025
భీమవరం: మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

భీమవరం గునుపూడి పీఎస్ఎం బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను స్వయంగా రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. 936 విద్యార్థులు కలిగిన ఉన్నత పాఠశాలలో విద్యార్థులంతా వరుస క్రమంలో వచ్చి ఆహార పదార్థాలను వడ్డించుకుని భుజించడం సంతోషంగా ఉందన్నారు.
News November 6, 2025
భీమవరం: కలెక్టరేట్ శాశ్వత భవనం ఎక్కడ..?

పశ్చిమ గోదావని జిల్లాకు నూతన కలెక్టరేట్ భవనం నిర్మాణం ఎక్కడ చేయాలనే అంశంపై కొంతకాలం పెద్ద వివాదం నడిచింది. జిల్లాలోని పెద్ద చర్చి ప్రదేశం అంశంగా కూడా ఈ వివాదం జరిగింది. ప్రస్తుతం ఆ వివాదాలు కనుమరుగై, కలెక్టరేట్ ఊసే లేకుండా పోయింది. భీమవరంలో నిర్మిస్తారా, ఉండిలో ఏర్పాటు చేస్తారా లేక నరసాపురం తరలిస్తారా అనేది తేలాల్సి ఉంది. దీనిపై అధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
News November 6, 2025
జాతీయ అండర్-19 జట్టుకు ఎంపికైన పాలకొల్లు సమీరుద్దీన్

పాలకొల్లు బ్రాడీపేటకు చెందిన షేక్ సమీరుద్దీన్ అండర్-19 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ డిసెంబర్ 5వ తేదీ నుంచి హర్యానాలో జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 69వ జాతీయ క్రికెట్ పోటిల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున అతను ప్రాతినిధ్యం వహించనున్నాడు. సమీరుద్దీన్ గతంలో ప. గో జిల్లా అండర్-17, ప్రస్తుతం అండర్-19 జట్లకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నట్లు కోచ్లు రామకృష్ణ, జయరాజు, రఫీలు తెలిపారు.


