News September 18, 2025
వరంగల్ మార్కెట్లో ధాన్యాల ధరలు ఇలా..!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు గురువారం చిరుధాన్యాలు తరలివచ్చాయి. సూక పల్లికాయ క్వింటా రూ.6,500 ధర వస్తే.. పచ్చి పల్లికాయకు రూ.4,100 ధర వచ్చింది. అలాగే మక్కలు (బిల్టీ) రూ.2,280 ధర పలికింది. 5531 రకం మిర్చి క్వింటా రూ.13,200, దీపిక మిర్చి రూ.14 వేలు, పసుపు రూ.10,659 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News September 18, 2025
VKB: ‘బియ్యాన్ని సమయానికి అందించాలి’

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందించే బియ్యాన్ని సమయానికి అందించాలని రైస్ మిల్లర్లకు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో సివిల్ సప్లై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లకు నిర్దేశించిన రైస్‌ను సకాలంలో అందిస్తే జిల్లాలోని రేషన్ షాపులకు త్వరగా పంపిణీ చేస్తామన్నారు.
News September 18, 2025
పార్వతీపురం: ‘స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత’

స్వచ్ఛందంగానే బంగారు కుటుంబాల దత్తత ఉంటుందని, మార్గదర్శి నిర్ణయమే ముఖ్యమని జాయింట్ కలెక్టర్ సి. యస్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ పి-4 బంగారు కుటుంబాల శిక్షణా తరగతులపై సమావేశం ఏర్పాటు చేశారు. బంగారు కుటుంబాల దత్తతకు మార్గదర్శకులు ముందుకు రావాలని కోరారు. ఇందులో ఎటువంటి ఒత్తిడి లేదని వారు స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగానే రావచ్చని పేర్కొన్నారు.
News September 18, 2025
APకి 13వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు

AP: రాష్ట్రానికి 13,050 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీకి గంగవరం పోర్టు ద్వారా యూరియా రాష్ట్రానికి చేరనుంది. కాగా ఈ కేటాయింపుతో రైతులకు మరింత వెసులుబాటు కలుగుతుందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని, రైతులు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్నారు.