News April 5, 2024
నయీం కేసుని రీఓపెన్ చేయాలి: హనుమంతరావు

TG: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్యాంగ్‌స్టర్ నయీం కేసుని నీరుగార్చారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హనుమంతరావు ఆరోపించారు. ఈ కేసులో బయటపడ్డ వందల కోట్లు, పేదల నుంచి లాక్కున్న భూములు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. నయీం అక్రమాల్లో పాలుపంచుకున్న పోలీసు అధికారులు, నాయకులు ఎవరనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం రేవంత్ చొరవ తీసుకుని ఈ కేసుని మళ్లీ తెరిచి విచారణ జరపాలని కోరారు.
Similar News
News November 9, 2025
ఆడపిల్ల పెళ్లికి రూ.65వేల సాయం: యోగి

యూపీలో భవన నిర్మాణ కార్మికులకు యోగి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘కన్యా వివాహ్ సహాయతా యోజన’ కింద ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేయనుంది. సాధారణ వివాహానికి రూ.65వేలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీకి రూ.75వేలు, సామూహిక వివాహాలకు రూ.85వేలు ఇవ్వనుంది. వీటితో పాటు వేడుక ఖర్చులకు రూ.15వేలు అదనంగా అందించనుంది. భవన నిర్మాణ కార్మికులు సమాజానికి వెన్నెముక అని యోగి కొనియాడారు.
News November 9, 2025
ఓటుకు రూ.7వేలు ఇస్తున్నారు: బండి సంజయ్

TG: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలన్నారు. ప్రజలను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెస్ రూ.5వేలు, BRS రూ.7వేలు ఇస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే KCR మెడలను వంచామని, కాంగ్రెస్ మెడలూ BJP వంచుతుందని వ్యాఖ్యానించారు. హిందువుల దమ్మేంటో జూబ్లీహిల్స్ ప్రజలు చూపించాలన్నారు.
News November 9, 2025
రేవంత్ ‘ముస్లిం’ వ్యాఖ్యలపై మండిపడ్డ రాజ్‌నాథ్

TG సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ‘<<18211719>>కాంగ్రెస్ అంటే ముస్లింలు<<>>.. ముస్లింలంటే కాంగ్రెస్ అని రెండుమూడు రోజుల కిందట TG సీఎం అన్నారు. రాజకీయాల్లో ఇంకా ఎంత వరకు దిగజారాలని కాంగ్రెస్ కోరుకుంటోంది?’ అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులను రెచ్చగొడుతున్నారని, దీనిపై వారు తీవ్రంగా ఆలోచించాలని కోరారు. దేశంలో అభివృద్ధి చేయగలిగేది NDA మాత్రమేనని చెప్పారు.


