News September 18, 2025
వరంగల్: రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన

నగర వాసులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీ ద్వారా ప్రత్యేక సూచనలు జారీ చేశారు. వాటిలో రోడ్డు దాటే సమయంలో జిబ్రా క్రాసింగ్ తప్పనిసరిగా ఉపయోగించాలని, వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్‌లు కచ్చితంగా పాటించాలన్నారు. డ్రైవింగ్ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లను ఉపయోగించొద్దని హెచ్చరించారు.
Similar News
News September 18, 2025
యూరియా తగినంత ఉంది కలెక్టర్ కీర్తి

జిల్లాలో యూరియా కొరతపై వ్యాపించిన వదంతులను నివృత్తి చేయడానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామాన్ని సందర్శించారు. దొమ్మేరు ప్యాక్స్ వద్ద రైతులు, అధికారులతో ఆమె మాట్లాడారు. జిల్లాలో యూరియా తగినంత నిల్వ ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు.
News September 18, 2025
నేను అన్ని మతాలను విశ్వసిస్తా: CJI గవాయ్

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ వస్తున్న విమర్శలపై CJI గవాయ్ స్పందించారు. ‘నేను అన్ని మతాలను విశ్వసిస్తా, గౌరవిస్తా. నా వ్యాఖ్యల్ని SMలో తప్పుగా చూపించారు’ అని అన్నారు. ఖజురహోలో ధ్వంసమైన విష్ణువు విగ్రహ పునర్నిర్మాణానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌ను ఇటీవల SC తిరస్కరించింది. ఈ సందర్భంగా ‘ASIని సంప్రదించండి లేదా ఏదైనా చేయమని దేవుడినే వేడుకోండి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News September 18, 2025
బతుకమ్మ, దసరా పండుగకు 7,754 ప్రత్యేక బస్సులు

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా TGSRTC 7,754 ప్రత్యేక బస్సులను సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 వరకు నడపనుంది. అందులో 377 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. MGBS, JBS, CBSతో పాటు KPHB, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడుస్తాయి. అక్టోబర్ 5, 6 తేదీల్లో తిరుగు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కూడా బస్సులను TGSRTC ఏర్పాటు చేయనుంది.