News September 18, 2025

అమీర్‌పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది!

image

నగరంలోని షాపింగ్ ప్రియులకు శుభవార్త. సిటీ నడిబొడ్డున ఉన్న అమీర్‌పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది. 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించిన అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది. ఈ దసరాకు ఇక్కడ ఫ్యాషన్, గ్రాసరీ, హోమ్ వేర్, వస్తు సామగ్రిపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. కుటుంబంలోని అన్ని తరాల వారిని దృష్టిలో పెట్టుకొని అమీర్‌పేటలో బ్రాంచ్ ఓపెన్ చేసినట్లు ఫౌండర్ శ్రీ పొట్టి వెంటటేశ్వర్లు తెలిపారు.

Similar News

News September 19, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నేడు కేటీఆర్ సమావేశం

image

నేడు BRS నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జూబ్లీహిల్స్‌లోని ముఖ్య నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు. అభ్యర్థితో పాటు గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసి విజయం సాధించడానికి చేయాల్సి కార్యచరణపై ఇవాళ చర్చించనున్నారు.

News September 19, 2025

వారంలో మూడు రోజులు ముచ్చింతల్‌కు బస్సులు

image

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్‌గంజ్‌, సికింద్రాబాద్‌, KPHB, ఉప్పల్‌, రిసాలాబజార్‌ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.  

News September 19, 2025

కోకా‌పేట్‌లో భర్తను చంపిన భార్య

image

కోకాపేట్‌లో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారిని అస్సాంకి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి దారితీసింది.