News September 18, 2025

బతుకమ్మ, దసరా పండుగకు 7,754 ప్రత్యేక బస్సులు

image

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా TGSRTC 7,754 ప్రత్యేక బస్సులను సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 2 వరకు నడపనుంది. అందులో 377 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది. MGBS, JBS, CBSతో పాటు KPHB, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడుస్తాయి. అక్టోబర్‌ 5, 6 తేదీల్లో తిరుగు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కూడా బస్సులను TGSRTC ఏర్పాటు చేయనుంది.

Similar News

News September 19, 2025

సంగారెడ్డి: ప్రమాదాలు జరగకుండా చూడాలి: ఎస్పీ

image

నేషనల్ హైవే 161 రోడ్డుపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదేశించారు. పుల్కల్ మండల పరిధిలోని నేషనల్ హైవే ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. హైవేపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాల వేగం అదుపు చేసేందుకు ర్యాంబుల్ స్ట్రిప్స్, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేయాలని సూచించారు.

News September 19, 2025

20న జనగామలో ఫుట్‌బాల్ క్రీడా ఎంపికలు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 20న జనగామ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్-19 ఫుట్‌బాల్ క్రీడా ఎంపికలు జరుగుతాయి. ప్రతి కళాశాల నుంచి ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటుందని క్రీడల కన్వీనర్ అజ్మీర కిషన్ తెలిపారు.

News September 19, 2025

పాకిస్థాన్ ఓవరాక్షన్‌పై ICC సీరియస్!

image

ఆసియా కప్: యూఏఈతో మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ ఓవరాక్షన్ వల్ల మ్యాచ్ గంట ఆలస్యమైన విషయం తెలిసిందే. ఆ రోజు రూల్స్ అతిక్రమించారని PCBకి ICC లేఖ, ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. స్టేడియంలో వీడియో రికార్డ్ చేసి వారి SM ఖాతాల్లో పోస్ట్ చేయడంపై కూడా సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలోనే PCBపై చర్యలు తీసుకునేందుకు ICC సిద్ధమవుతోందని సమాచారం. ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.