News April 5, 2024
88.03శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి

AP: రాష్ట్రంలో ఇప్పటివరకు 88.03% పెన్షన్ల పంపిణీ పూర్తైంది. నిన్న ఉ.7 గంటల నుంచే పెన్షన్ల పంపిణీని ప్రారంభించగా.. ఎక్కువ అనారోగ్య సమస్య ఉన్న వారు, వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే వెళ్లి సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు అందించారు. మొత్తంగా ఒకటిన్నర రోజుల్లో 57.83 లక్షల మంది లబ్ధిదారులకు ₹1749.53 కోట్లు అందించారు. ఇవాళ కూడా ఉ.7 గంటల నుంచి రా.7 గంటల వరకు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ కొనసాగనుంది.
Similar News
News April 22, 2025
దిగజారుతున్న పంత్ ప్రదర్శన.. ఫ్యాన్స్ ఫైర్

IPL: LSG కెప్టెన్ రిషభ్ పంత్ ప్రదర్శన రోజురోజుకూ దిగజారుతోంది. ఇవాళ DC మ్యాచ్‌లో చివర్లో వచ్చి డకౌట్ కాగా, ఆ జట్టు ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. వేలంలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ ఇస్తే, ఇలాగేనా ఆడేది? అంటూ మండిపడుతున్నారు. పంత్ ఈ ఏడాది లీగ్‌లో 8 ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక అర్ధశతకం(63) చేశారు. రెండు సార్లు డకౌట్ అయ్యారు. కేవలం 13.25 యావరేజ్, 96.36 స్ట్రైక్‌రేట్‌తో పేలవంగా ఆడుతున్నారు.
News April 22, 2025
రేపు 39 మండలాల్లో తీవ్ర వడగాలులు

AP: రేపు రాష్ట్రంలోని 39 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం(7), విజయనగరం(17), మన్యం(13), అల్లూరి జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఇవాళ నంద్యాల జిల్లాలోని దోర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. సిద్ధవటం-43.8, కర్నూలు-43.5, వతలూరు-42.9, పెద్ద దోర్నాలలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
News April 22, 2025
CM రేవంత్ వస్తేనే నా పెళ్లి: వైరా యువకుడు

TG: CM రేవంత్ వస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు భీష్మించుకొని కూర్చున్నాడు. సీఎం ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం ఫిక్స్ చేసుకుంటానన్నాడు. లేదంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటానని చెబుతున్నాడు. వైరాకు చెందిన భూక్యా గణేష్ అనే యువకుడు MLA రామ్‌దాస్ మాలోతుకు ఓ లెటర్ రాశాడు. తన పెళ్లికి CMను తీసుకొచ్చే బాధ్యత ఆయనదేనంటూ విన్నవించాడు. ఆ లెటర్‌ను MLA కూడా CMకు పంపాడు.