News April 5, 2024

ఎల్లుండి నుంచి వర్షాలు

image

TG: భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఎల్లుండి నుంచి రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో 30-40 కి.మీ వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Similar News

News October 8, 2024

డ్రగ్స్ కేసులో ‘పిశాచి’ మూవీ నటి!

image

మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా డ్రగ్స్ వ్యవహారం సైతం తెరపైకొచ్చింది. ఇటీవల గ్యాంగ్‌స్టర్ ఓం ప్రకాశ్ నిర్వహించిన డీజే పార్టీలో పలువురు నటీనటులు డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. పిశాచి చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన నటి ప్రయాగ మార్టిన్, మంజుమ్మల్ బాయ్స్ నటుడు శ్రీనాథ్ భాసి పార్టీలో ఉన్నట్లు సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

News October 8, 2024

GATE-2025 గడువు పొడిగింపు

image

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్‌-2025కు దరఖాస్తు గడువు తేదీని అధికారులు మరోసారి పొడిగించారు. గతంలో ప్రకటించినదాని ప్రకారం అక్టోబర్ 3నే గడువు ముగియాల్సి ఉంది. అయితే తాజా పొడిగింపుతో అక్టోబర్ 11 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. డెడ్‌లైన్ పొడిగించడం ఇది రెండోసారి. తొలుత సెప్టెంబర్ 26నే గడువు తేదీగా ప్రకటించారు. gate2025.iitr.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

News October 8, 2024

అవినీతి జగన్‌పై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి: భాను ప్రకాశ్

image

AP: అవినీతి సొమ్ము ఎలా సంపాదించాలనే విషయంలో జగన్ దేశానికే ఓ రోల్ మోడల్ అని బీజేపీ నేత భాను ప్రకాశ్ ఆరోపించారు. ‘APని జగన్ నాశనం చేసిన తీరుపై ఆర్జీవీ ఓ సినిమా తీయాలి. తిరుమలలో కమీషన్లు తీసుకున్న ఘనత గత ప్రభుత్వానిది. TTDకి చెందిన కొన్ని రిజర్వేషన్లలో YV సుబ్బారెడ్డి మార్పులు తెచ్చింది వాస్తవం కాదా? తిరుమలలో ఫొటోషూట్ చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.