News September 19, 2025
HYD: మ్యాన్‌హోల్ తెరిచి ఉంటే కాల్ చేయండి!

భారీ వర్షాల నేపథ్యంలో హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి PRT బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి MD అశోక్‌రెడ్డి ఆదేశించారు. రానున్న 2 రోజుల్లో ఉ.6 నుంచి ఉ.9 గం. వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మ్యాన్‌హోల్ మూతలు తెరవొద్దని, ఒకవేళ తెరిచి ఉంటే HMWSSB 155313, హైడ్రా 9000113667 నంబర్లకు కాల్ చేయాలన్నారు.
Similar News
News September 19, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నేడు కేటీఆర్ సమావేశం

నేడు BRS నేతలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జూబ్లీహిల్స్‌లోని ముఖ్య నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు. అభ్యర్థితో పాటు గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసి విజయం సాధించడానికి చేయాల్సి కార్యచరణపై ఇవాళ చర్చించనున్నారు.
News September 19, 2025
వారంలో మూడు రోజులు ముచ్చింతల్‌కు బస్సులు

ఆధ్యాత్మిక కేంద్రం ముచ్చింతల్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 20 నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. JBS, ఆఫ్జల్‌గంజ్, సికింద్రాబాద్, KPHB, ఉప్పల్, రిసాలాబజార్ ప్రాంతాల నుంచి బస్సులు నడుపుతామన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సౌకర్యం ఉంటుందని వివరించారు.
News September 19, 2025
కోకాపేట్‌లో భర్తను చంపిన భార్య

కోకాపేట్‌లో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారిని అస్సాంకి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి దారితీసింది.