News September 19, 2025
బాపట్ల: 18-30 ఏళ్లు ఉన్న వారికే ఈ ఛాన్స్

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బాపట్లలో శనివారం జాబ్ మేళాను స్థానిక సాల్వేషన్ ఆర్మీ ఐటీఐ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి మాధవి తెలిపారు. అరబిందో ల్యాబ్స్, ముత్తూట్ ఫైనాన్స్, రిలయన్స్ ట్రెండ్, వరుణ్ మోటార్స్ తదితర కంపెనీలు హాజరుకానున్నాయన్నారు. 18-30 ఏళ్లు కలిగి పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమో, ఏంబీఏ చదివిన నిరుద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.
Similar News
News September 19, 2025
టీడీపీలోకి మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

AP: మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు చిలకలూరిపేటకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ మంత్రి విడదల రజినితో విభేదాల కారణంగా ఇప్పటికే ఆయన వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజశేఖర్ వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్‌గానూ పనిచేశారు.
News September 19, 2025
HYD: ఇరిగేషన్ అనుమతులు ఇంకెప్పుడు?

HYD శివారు ప్రతాపసింగారంలో రైతులు 131 ఎకరాలు LPS కింద ప్రభుత్వానికి ఇచ్చారు. ఇందులో HMDA లేఅవుట్ వేసి రైతులకు- HMDAకు 60:40 నిష్పత్తిలో పంపిణీ చేయనుంది. అయితే భూమి ఇచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా ఇరిగేషన్ శాఖ అనుమతులు రాలేదు. ఇటీవల సీఎం రేవంత్ అధికారులను హెచ్చరించిన వారిలో చలనంలేదు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చినా అనుమతులు నిలువరించడంపై రైతులు మండిపడుతున్నారు. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
News September 19, 2025
ADB: పత్తి కొనుగోళ్లకు కొత్త యాప్..!

పత్తి కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించడానికి కేంద్రం కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. కనీస మద్దతు ధరకు పంటను విక్రయించేందుకు ‘కపాస్ కిసాన్’ యాప్‌ను తెచ్చింది. రైతులు యాప్‌లో OTPతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత స్లాట్ బుక్ ఆప్షన్ ఉంటుంది. దానిని ఎంచుకోవాలి. తర్వాత భూమి వివరాలు నమోదు చేసి స్లాట్ వివరాలు చెక్ చేసుకోవాలి. ఉమ్మడి ADBలో 5 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగవుతోంది.