News September 19, 2025

నేడే కృష్ణా జిల్లా ఎస్జీఎఫ్ షూటింగ్ జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో నేడు అండర్-14, 17 బాల, బాలికల షూటింగ్ జట్ల ఎంపికలు జరగనున్నాయి. భవానిపురంలోని గ్లోరియస్ స్పోర్ట్స్ అకాడమీలో ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఎంపికలకు హాజరయ్యే క్రీడా కారులు తమ స్టడీ సర్టిఫికేట్, జనన ధృవీకరణ పత్రం, పాఠశాల హెచ్ఎం సంతకం, సీల్‌తో ఉన్న ఎంట్రీ ఫారం తీసుకురావాలని SGF కార్యదర్శులు దుర్గారావు, రాంబాబు తెలిపారు.

Similar News

News September 19, 2025

బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

image

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.

News September 19, 2025

సీసీ కుంట: కురుమూర్తి స్వామికి రూ.2,02,75,000 ఆదాయం

image

చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు దీపావళి అమావాస్యకు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వివిధ వ్యాపారాల నిర్వహణకు నిర్వహించిన వేలంలో ఆలయానికి రూ.2,02,75,000 ఆదాయం వచ్చింది. కొబ్బరికాయల విక్రయానికి రూ.56.25 లక్షలు, పూజా సామగ్రికి రూ.16.50 లక్షలు, పులిహోర ప్రసాదం విక్రయానికి రూ.46 లక్షలు, తలనీలాల సేకరణకు రూ.32 లక్షలు పలికాయి.

News September 19, 2025

పోలీస్ శాఖలో 12,542 ఖాళీలు!

image

TG: పోలీస్ శాఖలో వివిధ కేటగిరీల్లో 12,542 ఖాళీ పోస్టులున్నాయి. ఈ మేరకు పోలీస్ శాఖ తాజాగా ఆర్థికశాఖకు వివరాలు సమర్పించింది. అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ కేటగిరీలో 8,442, ఏఆర్ కానిస్టేబుల్ 3,271, SI సివిల్ కేటగిరీలో 677, ఏఆర్‌లో 40, టీజీఎస్పీ కేటగిరీలో 22 పోస్టులున్నట్లు పేర్కొంది. వీటిని జాబ్ క్యాలెండర్‌లో పొందుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.