News September 19, 2025

ప్రతిభ చూపితే చాలు ఏటా రూ.12వేలు!

image

ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థుల నుంచి NMMS పరీక్షలకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏటా రూ.12వేల సాయం లభిస్తుంది. దరఖాస్తులు ఈ నెల 30లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. రీజనింగ్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో 3గంటల పాటు పరీక్ష నిర్వహిస్తారు. గతేడాది కర్నూలు జిల్లాలో 8,551 మంది పరీక్ష రాయగా 443 మంది అర్హత సాధించారు.

Similar News

News September 19, 2025

బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

image

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.

News September 19, 2025

సీసీ కుంట: కురుమూర్తి స్వామికి రూ.2,02,75,000 ఆదాయం

image

చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు దీపావళి అమావాస్యకు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వివిధ వ్యాపారాల నిర్వహణకు నిర్వహించిన వేలంలో ఆలయానికి రూ.2,02,75,000 ఆదాయం వచ్చింది. కొబ్బరికాయల విక్రయానికి రూ.56.25 లక్షలు, పూజా సామగ్రికి రూ.16.50 లక్షలు, పులిహోర ప్రసాదం విక్రయానికి రూ.46 లక్షలు, తలనీలాల సేకరణకు రూ.32 లక్షలు పలికాయి.

News September 19, 2025

పోలీస్ శాఖలో 12,542 ఖాళీలు!

image

TG: పోలీస్ శాఖలో వివిధ కేటగిరీల్లో 12,542 ఖాళీ పోస్టులున్నాయి. ఈ మేరకు పోలీస్ శాఖ తాజాగా ఆర్థికశాఖకు వివరాలు సమర్పించింది. అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ కేటగిరీలో 8,442, ఏఆర్ కానిస్టేబుల్ 3,271, SI సివిల్ కేటగిరీలో 677, ఏఆర్‌లో 40, టీజీఎస్పీ కేటగిరీలో 22 పోస్టులున్నట్లు పేర్కొంది. వీటిని జాబ్ క్యాలెండర్‌లో పొందుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.