News September 19, 2025
భువనగిరిలో ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు

యాదాద్రి భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం అండర్-19 విభాగంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలలో నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలకు చెందిన జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొనవచ్చని కళాశాల ప్రిన్సిపల్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న బాల, బాలికలు తమ ఎస్ఎస్‌సీ మెమోతో ఉదయం 8:30 గంటలకు కళాశాలకు చేరుకోవాలని సూచించారు.
Similar News
News September 19, 2025
సీసీ కుంట: కురుమూర్తి స్వామికి రూ.2,02,75,000 ఆదాయం

చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు దీపావళి అమావాస్యకు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వివిధ వ్యాపారాల నిర్వహణకు నిర్వహించిన వేలంలో ఆలయానికి రూ.2,02,75,000 ఆదాయం వచ్చింది. కొబ్బరికాయల విక్రయానికి రూ.56.25 లక్షలు, పూజా సామగ్రికి రూ.16.50 లక్షలు, పులిహోర ప్రసాదం విక్రయానికి రూ.46 లక్షలు, తలనీలాల సేకరణకు రూ.32 లక్షలు పలికాయి.
News September 19, 2025
పోలీస్ శాఖలో 12,542 ఖాళీలు!

TG: పోలీస్ శాఖలో వివిధ కేటగిరీల్లో 12,542 ఖాళీ పోస్టులున్నాయి. ఈ మేరకు పోలీస్ శాఖ తాజాగా ఆర్థికశాఖకు వివరాలు సమర్పించింది. అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ కేటగిరీలో 8,442, ఏఆర్ కానిస్టేబుల్ 3,271, SI సివిల్ కేటగిరీలో 677, ఏఆర్‌లో 40, టీజీఎస్పీ కేటగిరీలో 22 పోస్టులున్నట్లు పేర్కొంది. వీటిని జాబ్ క్యాలెండర్‌లో పొందుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
News September 19, 2025
కడప: ఉల్లి రైతులకు శుభవార్త

ఉల్లి సాగు చేసిన రైతులంతా తమ పంటను రైతు బజార్లు, మార్కెట్ యార్డుల్లో విక్రయించుకోవచ్చని, ఎటువంటి గుర్తింపు కార్డులు చూపాల్సిన అవసరం లేదని కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్పష్టం చేశారు. కిలో రూ.12 చొప్పున రైతులు ఉల్లిని విక్రయించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.