News September 19, 2025

శబరిమల యాత్రకు వెళ్లి..తిరుగొస్తుండగా ఒకరి మృతి

image

సంతమాగులూరు మండలంలోని ఫతేపురం గ్రామానికి చెందిన సాంబయ్య శబరిమల యాత్ర తిరుగు ప్రయాణంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈనెల 14న తన స్నేహితుడితో కలిసి శబరిమలకు వెళ్లాడు. స్వామివారి దర్శనం అనంతరం తిరిగి రైలులో స్వగ్రామం బయలుదేరాడు. తమిళనాడు రాష్ట్రంలో గుండెపోటు రావడంతో రైల్వే సిబ్బంది ఆస్పుత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు చెప్పారు. దీంతో పత్తేపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News September 19, 2025

HYD: సోషల్ మీడియా వాడుతున్నారా? జాగ్రత్త!

image

సోషల్ మీడియా వాడేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని HYD పోలీసులు సూచించారు. పోస్ట్ చేసే ముందు ఆలోచించండి. వ్యక్తిగత, సున్నితమైన వివరాలు పంచుకోవద్దు. మీ భద్రత, గౌరవం మీరు పంచుకునే విషయాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఒక క్లిక్‌తోనే అంతటా వ్యాప్తి చెందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా పోస్ట్ చేయండి. పంచుకునే ముందు ధ్రువీకరించండి. తప్పుడు సమాచారం అందరికీ హానికరంగా మారుతుందన్నారు.

News September 19, 2025

HYD: 40 ప్రాంతాల్లో వరదలకు కారణం ఇదే..!

image

గ్రేటర్ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ జనాభాకు అవసరమైన స్థాయిలో లేకపోవడం, మరోవైపు సిల్ట్ భారీ మొత్తంలో పేరుక పోవడంతో అనేక చోట్ల నాలాలు పూడుకపోయాయి. ఇలాంటి పరిస్థితి దాదాపు 40 చోట్ల ఉన్నట్లు గుర్తించిన హైడ్రా ఎక్కడికక్కడ సిల్ట్ క్లియర్ చేయడంపై ఫోకస్ పెట్టినట్లు వివరించింది. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొంది.

News September 19, 2025

మునగాకుతో జుట్టు సమస్యలకు చెక్

image

మునగాకులలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగాకు పొడిని హెయిర్ ప్యాక్‌గా వాడుకోవచ్చు. టేబుల్ స్పూన్ మునగాకు పొడికి కొంచెం పెరుగు కలిపి పేస్టులా చేసుకోవాలి. దీన్ని కుదుళ్లకు పట్టేలా వేసుకొని అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో చుండ్రు, దురద తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యవంతంగా, నిగనిగలాడుతుంది.