News September 19, 2025
నెల్లూరు: రూ.15వేల సాయం.. నేడే లాస్ట్ ఛాన్స్

నెల్లూరు జిల్లాలోని ఆటో, మ్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం వాహనమిత్ర కింద రూ.15వేలు సాయం చేయనుంది. ఈనెల 17వ తేదీ నుంచి సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. 2023 వరకు ఈ పథకం కింద సాయం పొందిన వాళ్లు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్లు ఎవరైనా ఉంటే ఇవాళ సాయంత్రంలోపే దరఖాస్తు చేసుకోవాలి. 2023 వరకు సాయం పొందిన వాళ్లు సైతం సచివాలయంలో పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడం మంచిది.
Similar News
News November 5, 2025
నెల్లూరు: రేపే నారా లోకేశ్ రాక

నెల్లూరు జిల్లాలో నారా లోకేశ్ పర్యటన ఖారారైంది. ఆయన గురువారం దగదర్తికి రానున్నారు. దివంగత ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. సంబంధిత ఏర్పాట్లను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కావలి డీఎస్పీ శ్రీధర్ బుధవారం పరిశీలించారు.
News November 5, 2025
NLR: జనసేనలో విబేధాలపై రహస్య విచారణ

నెల్లూరు జనసేనలో నెలకొన్న అంతర్గత విభేదాలపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. టిడ్కో ఛైర్మన్ అజయ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఓ వర్గం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాకు MSME ఛైర్మన్ శివ శంకర్ వచ్చారు. రెండు రోజుల పాటు నేతలతో విడివిడిగా మాట్లాడారు. నివేదికను జనసేనానికి అందివ్వనున్నారు. జనసేనాని జోక్యంతో నేతల్లో ఉన్న అసంతృప్తి జ్వాల చల్లారుతుందో లేదో చూడాలి.
News November 5, 2025
లంకా దినకర్ నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా

20 అంశాల కార్యక్రమ అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆయన బుధవారం జిల్లాలోని ఏదో ఒక ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, సాయంత్రం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. అనివార్య కారణాలవల్ల ఈ పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్ వెల్లడించారు.


