News September 19, 2025
దసరా సెలవులు.. స్కూళ్లు, కాలేజీలకు హెచ్చరిక

TG: దసరా సెలవుల్లో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఎలాంటి తరగతులు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సెలవుల్లో రివిజన్ కోసం విద్యార్థులకు కొంత హోమ్ వర్క్ ఇవ్వాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు, జూ.కాలేజీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉండనున్నాయి.
Similar News
News January 27, 2026
బెంగళూరు అంకుల్ అంటూ జగన్‌పై టీడీపీ సెటైర్లు

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై టీడీపీ Xలో సెటైరికల్ పోస్ట్ చేసింది. ‘ఏ బెంగ, బెదురులేని దొంగ బెంగళూరు అంకుల్. ఆయనకు దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. సంక్రాంతికి సొంతూరు రాడు. రిపబ్లిక్ డేని పట్టించుకోడు’ అని పేర్కొంది. దీనిపై వైసీపీ శ్రేణులు ఫైరవుతున్నాయి. ముందు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ కౌంటర్ ఇస్తున్నాయి.
News January 27, 2026
రైలు ఆలస్యంతో పరీక్షకు గైర్హాజరు.. విద్యార్థినికి రూ.9లక్షల పరిహారం

UPలోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి అనే విద్యార్థిని 7ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత రైల్వేపై కేసు గెలిచింది. 2018లో రైలు ఆలస్యం వల్ల ఆమె Bsc ప్రవేశ పరీక్ష రాయలేకపోయింది. దీంతో పరిహారం కోరుతూ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. రైలు ఆలస్యమవడంపై అధికారుల నుంచి సరైన వివరణ రాకపోవడంతో ఆమెకు 45 రోజుల్లో రూ.9.10L చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చెల్లింపు ఆలస్యమైతే 12% వడ్డీ చెల్లించాలని పేర్కొంది.
News January 27, 2026
జనవరి 27: చరిత్రలో ఈరోజు

1922: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ జననం
1927: తెలుగు కవి, రచయిత పోతుకూచి సాంబశివరావు జననం
1936: కథా, నవలా రచయిత్రి కోడూరి కౌసల్యాదేవి జననం
2009: భారత మాజీ రాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్ మరణం
2023: సినీ నటి జమున మరణం (ఫొటోలో)
* కుటుంబ అక్షరాస్యత దినోత్సవం


