News September 19, 2025
WGL: ఆర్ఎంపీ, పీఎంపీలపై అధికారుల కొరడా

WGL, KZP, HNK, దుగ్గొండి సహా 12 ప్రాంతాల్లో TG మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య కుమార్ ఆదేశాల మేరకు ఛైర్మన్ డాక్టర్ మహేశ్ కుమార్ గురువారం రాత్రి ఏకకాలంలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా 18 మంది ఆర్ఎంపీ, పీఎంపీ అనధికారికంగా వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక మోతాదులో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారని వారిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News September 19, 2025
సిరిసిల్ల: పేకాటస్థావరంపై దాడులు.. ఒకరు మృతి

ఎల్లారెడ్డిపేట మం. వెంకటపూర్లో గురువారం రాత్రి పోలీసులు <<17757085>>పేకాటస్థావరంపై దాడులు<<>> చేశారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చాకలి రాజయ్య(55) భయంతో పరుగులు తీశాడు. చీకటి పడ్డా అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు గాలించారు. ఈ క్రమంలో వాగు సమీపంలో రాజయ్య పడున్నాడు. కుటుంబ సభ్యులు చూసేసరికి అప్పటికే మృతిచెందాడు. పరుగులు తీయడంతోనే రాజయ్య కుప్పకూలాడని, ఈ క్రమంలో గుండెపోటు వచ్చి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.
News September 19, 2025
షెడ్యుల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలి: అడిషనల్ కలెక్టర్

తరగతి గదిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, షెడ్యుల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు. మరిపెడ పట్టణంలోని మోడల్ స్కూల్ ను ఆయన సందర్శించారు. వంటశాల, స్టోర్ రూం, హాస్టల్ గదులు, తరగతి గదులను, స్టాఫ్ రూం లను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రమైన వాతావరణం ఉండాలన్నారు. విద్యార్థుల్లోని సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు.
News September 19, 2025
వరంగల్: మద్యం తాగి వాహనం నడిపితే ప్రమాదం!

మద్యం తాగి డ్రైవ్ చేయవద్దని వరంగల్ పోలీసులు హెచ్చరించారు. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసిన అవగాహన పోస్టర్‌లో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, అమాయకుల ప్రాణాలకు ప్రమాదం వంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది మద్యం తాగి వాహనం నడపడం వల్ల అనేక దుర్ఘటనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.