News September 19, 2025

నెల్లూరు: ఏడుగురి మృతి.. ముగ్గురిపై కేసు

image

సంగం మండలం పెరమన వద్ద కారును ఇసుక టిప్పర్ ఢీకొని ఏడుగురు చనిపోయిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది. ఏ1గా టిప్పర్ డ్రైవర్, ఏ2గా టిప్పర్ యజమానిని, ఏ3గా బుజ్జినాయుడు పేర్లు నమోదు చేశారు. బుజ్జినాయుడిని ఇసుక వ్యాపారిగా పోలీసులు భావిస్తున్నారు. ఇసుకను ఆత్మకూరు వైపు నుంచి తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఆత్మకూరు పరిధిలో ప్రస్తుతం ఏ ఇసుక రీచ్‌కు అనుమతులు లేకపోవడం గమనార్హం.

Similar News

News September 19, 2025

నెల్లూరు: రష్యాలో శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

image

రష్యాలో నైపుణ్యాభివృద్ధిపై శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అధికారి అబ్దుల్ కయ్యం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల పాటు శిక్షణ అందిస్తారని, భోజన వసతితో పాటు స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. 18 నుంచి 20 ఏళ్ల వయస్సు కలిగి 75% ఇంగ్లీషులో మార్కులు సాధించిన అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News September 19, 2025

‘విజయ’ సీటు కోసం వార్..!

image

నెల్లూరు విజయ డెయిరీ ఛైర్మన్ పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. 14 ఏళ్లుగా ఛైర్మన్‌గా కొనసాగుతున్న రంగారెడ్డి పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. కీలకమైన ఈ పోస్టు కోసం సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల నాయకులు పోటీపడుతున్నారు. మొదట సర్వేపల్లికి చెందిన బాబిరెడ్డి పేరు దాదాపు ఖాయమని ప్రచారం జరిగినప్పటికీ కోవూరు, ఆత్మకూరు నేతలు తీవ్రపోటీ ఇస్తున్నారు. ఫైనల్‌గా అదృష్టం ఎవరిని వరిస్తుందో..?

News September 19, 2025

నెల్లూరు: రూ.15వేల సాయం.. నేడే లాస్ట్ ఛాన్స్

image

నెల్లూరు జిల్లాలోని ఆటో, మ్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం వాహనమిత్ర కింద రూ.15వేలు సాయం చేయనుంది. ఈనెల 17వ తేదీ నుంచి సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. 2023 వరకు ఈ పథకం కింద సాయం పొందిన వాళ్లు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్లు ఎవరైనా ఉంటే ఇవాళ సాయంత్రంలోపే దరఖాస్తు చేసుకోవాలి. 2023 వరకు సాయం పొందిన వాళ్లు సైతం సచివాలయంలో పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడం మంచిది.