News September 19, 2025

పట్టాభిరాముని ఆలయాభివృద్ధికి చర్యలు: TTD

image

అన్న‌మ‌య్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ ప‌ట్టాభిరామ‌స్వామివారి ఆల‌యాభివృద్ధికి TTD చర్యలు చేపట్టింది. ఆలయ పుష్క‌రిణి, క‌ళ్యాణ వేదిక మండ‌పం, రాజ‌గోపురం, ఆర్చి, క‌ళ్యాణ మండ‌పం త‌దిత‌ర ప‌నుల‌కు రూ.5.73 కోట్లు మంజూరు చేసింది. అదేవిధంగా త‌రిగొండ‌లోని శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి పుష్క‌రిణి పునఃనిర్మాణానికి రూ.1.50 కోట్ల‌తో ప‌నులు చేప‌ట్టేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది.

Similar News

News September 19, 2025

నిర్మల్: క్రైస్తవ మైనారిటీల సమస్యలపై సమీక్ష

image

రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కమిషన్ ఛైర్మన్ దీపక్ జాన్, కలెక్టర్ అభిలాష అభినవ్ సమక్షంలో కలెక్టరేట్‌లో కార్యాలయంలో క్రైస్తవ మైనారిటీల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన క్రైస్తవులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తద్వారా వారు అభివృద్ధి సాధించవచ్చన్నారు.

News September 19, 2025

SKU డిగ్రీ ఫలితాలు విడుదల

image

శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ ఫలితాలను ఇన్‌ఛార్జి ఉపకులపతి ప్రొఫెసర్ అనిత విడుదల చేశారు. నాలుగో సెమిస్టర్‌లో 7,798 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,250 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో సెమిస్టర్‌లో 7,760 మంది పరీక్షలు రాసి 3,535 విద్యార్థులు పాస్ అయ్యారు. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ డాక్టర్ రమేశ్ బాబు, పరీక్షల విభాగం డైరెక్టర్ జీవీ రమణ పాల్గొన్నారు.

News September 19, 2025

తమిళనాట పట్టు కోసం రసపట్టుగా పాలిట్రిక్స్!

image

వచ్చే వేసవిలో ఎన్నికలున్న తమిళనాడులో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. ఇన్నాళ్లూ పాలు నీళ్లలా ఉన్న DMK-కాంగ్రెస్‌ల స్నేహం చెడినట్లుంది. DMK తమను చెరుకుగడలా వాడుకుని పీల్చి పిప్పి చేసి వదిలేసిందని TN-PCC ex చీఫ్ KS అళగిరి ఆరోపించారు. DMKతో కలవాలంటే ఈసారి కాంగ్రెస్‌కు మంత్రి పదవులు, గతంలో కంటే ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే TVK (విజయ్)తో పొత్తుకూ వెళ్తామని సంకేతాలిచ్చారు.