News September 19, 2025

బైరెడ్డి హౌస్ అరెస్ట్

image

నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త డా.దారా సుధీర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ‘ఛలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమంలో భాగంగా నంద్యాలకు వెళ్తున్న ఆయనను నందికొట్కూరు డిగ్రీ కాలేజ్ వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ శ్రేణులు రోడ్డుపై భైఠాయించి నిరసనకు దిగారు. మరోవైపు వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లి తీరుతానని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News September 19, 2025

భారత్‌ను ఓడించిన కివీసే మా స్ఫూర్తి: WI కోచ్

image

భారత్‌లో ఆడే టెస్ట్ సిరీస్‌లో రాణించేందుకు న్యూజిలాండ్‌ను స్ఫూర్తిగా తీసుకుంటామని వెస్టిండీస్ కోచ్ డారెన్ సమీ అన్నారు. ‘గత ఏడాది ఇండియాలో NZ 3-0 తేడాతో సిరీస్ గెలిచింది. గెలిచేందుకు 20 వికెట్లు తీయాలి. మా పేసర్లకు ఆ సత్తా ఉంది. గెలవాలనే మైండ్ సెట్‌తోనే ఇండియా టూరుకు వెళ్తాం’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు. IND, WI మధ్య అక్టోబర్ 2 నుంచి తొలి టెస్ట్, 10 నుంచి రెండో టెస్ట్ జరగనుంది.

News September 19, 2025

కోటబొమ్మాళి: రైలు ప్రమాదంలో ఒకరు మృతి

image

కోటబొమ్మాళి మండలం హరిచంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జిఆర్పీ హెడ్ కానిస్టేబుల్ మెట్ట సోమేశ్వరరావు శుక్రవారం తెలిపారు. మృతుడికి సుమారు 50 ఏళ్లు ఉంటాయన్నారు. వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ స్టేషన్‌‌‌కు తెలపాలన్నారు. 9492250069 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.

News September 19, 2025

నెల్లూరు: రష్యాలో శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

image

రష్యాలో నైపుణ్యాభివృద్ధిపై శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అధికారి అబ్దుల్ కయ్యం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల పాటు శిక్షణ అందిస్తారని, భోజన వసతితో పాటు స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. 18 నుంచి 20 ఏళ్ల వయస్సు కలిగి 75% ఇంగ్లీషులో మార్కులు సాధించిన అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.