News April 5, 2024

బాధ్యతలు స్వీకరించిన నెల్లూరు ఎస్పీ

image

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని.. వారు ఎప్పుడైనా తనను నిర్భయంగా కలవవచ్చని నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సూచించారు. నూతన ఎస్పీగా గురువారం రాత్రి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఆరిఫ్ హఫీజ్ 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తొలి పోస్టింగ్‌లో నర్సీపట్నం ఏఎస్పీగా, అనంతరం రంపచోడవరం ఓఎస్డీగా పని చేశారు.

Similar News

News October 2, 2025

గుండ్లపాలెంలో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

image

గుడ్లూరు మండలం గుండ్లపాలెం గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దారిలో వెళ్తున్న బైక్‌ను కారు ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు తీవ్ర గాయాలపాలవ్వగా, మరొకరు అక్కడిక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 2, 2025

పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ లో పాల్గొన్న ఎస్పీ

image

విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఆయుధాలకు ఎస్పీ డా. అజిత వేజెండ్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా కనకదుర్గ భవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేస్తే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఎంతో మందికి ఆదర్శప్రాయుడని కొనియాడారు.

News October 2, 2025

నెల్లూరు: NMC లో చందాలు..!

image

NMC లో దసరా చందాకు తెరలేపారు. ప్రజారోగ్య విభాగంలో కొంతమంది విజిలెన్స్ అధికారుల పేరు చెప్పి సిబ్బంది నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేసినట్లు సమాచారం. శానిటరీ సూపర్వైజర్లు దందా చేసినట్లు తెలిసింది. ట్రేడ్ లైసెన్స్లు వ్యవహారం అంటూ.. అధికారుల పేరు చెప్పడంతో కార్యదర్సులు చందాను ఇచ్చారు. ఒక్కొక్కరి నుంచి రూ. 2 వేలు వరకు వసూలు చేశారని కొంతమంది వాపోతున్నారు. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.