News September 19, 2025
కోకాపేట్‌లో భర్తను చంపిన భార్య

కోకాపేట్‌లో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారు అస్సాంకి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి దారితీశాయి.
Similar News
News September 19, 2025
కోటబొమ్మాళి: రైలు ప్రమాదంలో ఒకరు మృతి

కోటబొమ్మాళి మండలం హరిచంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జిఆర్పీ హెడ్ కానిస్టేబుల్ మెట్ట సోమేశ్వరరావు శుక్రవారం తెలిపారు. మృతుడికి సుమారు 50 ఏళ్లు ఉంటాయన్నారు. వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ స్టేషన్‌కు తెలపాలన్నారు. 9492250069 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
News September 19, 2025
నెల్లూరు: రష్యాలో శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

రష్యాలో నైపుణ్యాభివృద్ధిపై శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అధికారి అబ్దుల్ కయ్యం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల పాటు శిక్షణ అందిస్తారని, భోజన వసతితో పాటు స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. 18 నుంచి 20 ఏళ్ల వయస్సు కలిగి 75% ఇంగ్లీషులో మార్కులు సాధించిన అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News September 19, 2025
విజయవాడ: క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటన

దసరా మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో కాలినడకన పర్యటించి పరిశీలించారు. ఈ ఏడాది భక్తులకు మధురానుభూతులను మిగిల్చేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.