News September 19, 2025
సొరకాయలు కోతకు వచ్చినట్లు ఎలా గుర్తించాలి?

సొరకాయల పంట నాటిన 55-75 రోజులకు కోతకు వస్తుంది. లేత కాయలను గోటితో నొక్కినప్పుడు తొక్క లోపలికి గోరు సులభంగా పోతుంది. అలాగే లేత కాయల తొక్క మీద నూగు ఉంటుంది. కాయ లోపల గింజలు, గుజ్జు గట్టిపడక ముందే కాయలను కోసి మార్కెట్‌కు తరలించాలి. ముదిరిన కాయల తొక్క గట్టిపడి క్రమంగా తెలుపు రంగులోకి మారుతుంది. కాయలను కోసేటప్పుడు తొడిమలతో సహా కోసి మార్కెట్‌కు తరలించాలి. కోసిన కాయలు 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
Similar News
News January 26, 2026
ముగిసిన రిపబ్లిక్ డే వేడుకలు

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 77వ రిపబ్లిక్ డే వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో పరిసరాలు హోరెత్తాయి. అంతకుముందు కీరవాణి కంపోజ్ చేసిన పాటను శ్రేయా ఘోషల్ ఆలపించారు. త్రివిధ దళాలు చేసిన విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. సైన్యం నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి వారికి వీడ్కోలు పలికి అతిథులతో గుర్రపు బగ్గీలో అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు.
News January 26, 2026
మావోల గడ్డపై తొలిసారి గణతంత్ర వేడుకలు

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం చరిత్రలో నేడు ఒక మరిచిపోలేని ఘట్టం నమోదైంది. దశాబ్దాల పాటు మావోయిస్టుల ప్రభావంతో జాతీయ పండుగలకు దూరమైన 47 మారుమూల గ్రామాలు తొలిసారి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయి. బీజాపూర్, నారాయణ్‌పూర్, సుక్మా జిల్లాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. రోడ్లు, బ్యాంకులు, పాఠశాలలు అందుబాటులోకి వస్తున్నాయి.
News January 26, 2026
మంచు మనోజ్ భయంకరమైన లుక్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భయంకరమైన లుక్‌లో దర్శనమిచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నాలోని సరికొత్త కోణం. క్రూరమైన, క్షమించలేని’ అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాకు హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ విడుదల కానుంది.


