News September 19, 2025

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వివరాలు (1/2)

image

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. ఆరోజు ధ్వజారోహణం నుంచి వేడుకలు మొదలై, అక్టోబర్ రెండవ తేదీన ముగుస్తాయి. రోజువారి వివరాలివే..
Day 1(sep 24) : బంగారు తిరుచ్చి ఉత్సవం, పెద్దశేష వాహనం.
Day 2(sep 25) : చిన్న శేష వాహనం, హంస వాహనం
Day 3(sep 26) : సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం

Similar News

News September 19, 2025

ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే దాదాపు 13 బిల్లులకు ఆమోదం తెలిపింది. వాహనమిత్ర కింద ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు అందించే పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని పరిధిలో 343 ఎకరాల భూసేకరణకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అటు నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లును ఆమోదించింది.

News September 19, 2025

వాహనదారులకు గుడ్ న్యూస్.. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు

image

AP: పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మోటార్ వాహనాల చట్టంలో సవరణ చేస్తూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సభలో బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుకు ఆమోదం లభించడంతో ఓల్డ్ వెహికల్స్‌పై గ్రీన్ ట్యాక్స్ రూ.20 వేల నుంచి రూ.3వేలకు తగ్గనుంది.

News September 19, 2025

తమిళనాట పట్టు కోసం రసపట్టుగా పాలిట్రిక్స్!

image

వచ్చే వేసవిలో ఎన్నికలున్న తమిళనాడులో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. ఇన్నాళ్లూ పాలు నీళ్లలా ఉన్న DMK-కాంగ్రెస్‌ల స్నేహం చెడినట్లుంది. DMK తమను చెరుకుగడలా వాడుకుని పీల్చి పిప్పి చేసి వదిలేసిందని TN-PCC ex చీఫ్ KS అళగిరి ఆరోపించారు. DMKతో కలవాలంటే ఈసారి కాంగ్రెస్‌కు మంత్రి పదవులు, గతంలో కంటే ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే TVK (విజయ్)తో పొత్తుకూ వెళ్తామని సంకేతాలిచ్చారు.