News April 5, 2024
గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. మిల్లర్ దూరం!
గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద షాక్ తగిలేలా ఉంది. పించ్ హిట్టింగ్తో ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించే సఫారీ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ గాయపడ్డారు. రెండు వారాలు జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం కారణంగానే అతడు పంజాబ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగలేదని కేన్ విలియమ్సన్ వెల్లడించారు. నిన్నటి మ్యాచ్‌లో మిల్లర్‌కు బదులుగా కేన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News January 8, 2025
‘పుష్ప-2’కు మ్యూజిక్.. తమన్ క్లారిటీ
‘పుష్ప-2’కు మ్యూజిక్ ఇచ్చానని గతంలో చేసిన వ్యాఖ్యలపై సంగీత దర్శకుడు తమన్ స్పష్టతనిచ్చారు. సినిమా రిలీజ్‌కు తక్కువ సమయం ఉండటంతో BGM ఇవ్వాలని తనను నిర్మాతలు కోరినట్లు తెలిపారు. తాను చేయడం కరెక్టేనా అని అడిగితే అవసరాన్ని బట్టి వినియోగిస్తామని వారు బదులిచ్చినట్లు పేర్కొన్నారు. రీ రికార్డింగ్ సమయంలో సుకుమార్ ఫోన్ నంబర్ తీసుకున్నట్లు తెలిపారు. కాగా సినిమాలో సామ్ సి అందించిన BGMను తీసుకున్నారు.
News January 8, 2025
ఆరోగ్యశ్రీపై చంద్రబాబుకు ఎందుకు అంత కక్ష?: వైఎస్ జగన్
AP: ఆరోగ్యశ్రీపై సీఎంకు ఎందుకంత కక్ష అంటూ మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘వైద్యానికి ఎంత ఖర్చైనా ప్రజలు ఉచితంగా చికిత్స పొందేలా పథకాన్ని తీర్చిదిద్దాం. దాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు నాశనం చేస్తోంది? నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3వేల కోట్లు బకాయిలు పెట్టారు. కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి షూరిటీ లేదు. మీ చర్యల్ని ఖండిస్తున్నా. ఆరోగ్యశ్రీని వెంటనే యథాతథంగా అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
News January 8, 2025
షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్.. పాస్‌పోర్ట్ రద్దు
మాజీ PM షేక్ హసీనా పాస్‌పోర్టును బంగ్లా ప్రభుత్వం రద్దు చేసింది. రిజర్వేషన్లపై చెలరేగిన అల్లర్ల సమయంలో కిడ్నాప్‌లు, హత్యలకు పాల్పడ్డారంటూ ఆమెతోపాటు మరో 11 మందికి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. FEB 12లోగా అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఆమె పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది. బంగ్లాలో అల్లర్ల సమయంలో పారిపోయిన వచ్చిన హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు.