News September 19, 2025
ADB: పత్తి కొనుగోళ్లకు కొత్త యాప్..!

పత్తి కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించడానికి కేంద్రం కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. కనీస మద్దతు ధరకు పంటను విక్రయించేందుకు ‘కపాస్ కిసాన్’ యాప్‌ను తెచ్చింది. రైతులు యాప్‌లో OTPతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత స్లాట్ బుక్ ఆప్షన్ ఉంటుంది. దానిని ఎంచుకోవాలి. తర్వాత భూమి వివరాలు నమోదు చేసి స్లాట్ వివరాలు చెక్ చేసుకోవాలి. ఉమ్మడి ADBలో 5 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగవుతోంది.
Similar News
News September 19, 2025
మంచిర్యాల: స్టాండడైజేషన్ కమిటీ సమావేశంలో జనక్ ప్రసాద్

కోల్ ఇండియా JBCCI-Xl స్టాండైజేషన్ కమిటీలో INTUC యూనియన్‌కు చోటు దక్కింది. ఈ మేరకు కోల్‌కత్తా హైకోర్టు తీర్పు వెలువడించింది. దీంతో ఈనెల 22న జరగనున్న 6వ JBCCI-Xl స్టాండడైజేషన్ కమిటీ సమావేశంలో INTUC యూనియన్ పాల్గొననుంది. ఆల్టర్నేట్ సభ్యులుగా INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ పేరును ఫెడరేషన్ ప్రతిపాదించింది. దీంతో సింగరేణి యూనియన్ నాయకులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
News September 19, 2025
పుట్టపర్తి: చౌక దుకాణ డీలర్లకు కొత్త ఈ-పాస్ యంత్రాలు

పుట్టపర్తి కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని చౌక దుకాణ డీలర్లకు జేసీ అభిషేక్ కుమార్ కొత్త ఈ-పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. డీలర్లకు 2 రోజుల పాటు కొత్త యంత్రాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు, 65 ఏళ్లు పైబడిన వారికి ఈ నెల 26 నుంచి రేషన్ పంపిణీ చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 1367 యంత్రాల ద్వారా వేలిముద్ర, కంటి స్కాన్ లేదా స్మార్ట్ కార్డ్ ద్వారా రేషన్ పంపిణీ జరుగుతుందన్నారు.
News September 19, 2025
నల్గొండ: ‘నా కోరిక తీరిస్తే B.Ed పాస్ చేస్తా’

నల్గొండలోని డైట్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు B.Ed విద్యార్థినిని వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కోరిక తీరిస్తే B.Ed పాస్ చేయిస్తానని సదరు ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఈ ఉపాధ్యాయుడు పాఠశాలలో చదువుతున్న బాలికలకు ముద్దులు పెట్టడం, వెకిలి చేష్టలకు పాల్పడటంతో అతడిని దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.