News September 19, 2025

దేశంలోనే ముల్కనూర్ సహకార సొసైటీ నంబర్ 1

image

HNK జిల్లా భీమదేవరపల్లి(M) ముల్కనూర్ సహకార సొసైటీ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. ఇది ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద సోసైటీగా గుర్తింపు పొందింది. 1956లో అలిగిరెడ్డి విశ్వనాథ్ రెడ్డి 373 మంది రైతులతో రూ.2,300 మూలధనంతో ప్రారంభించారు. ఈ సొసైటీ ప్రస్తుతం 7,540 మంది రైతులతో రూ.400 కోట్లతో విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం ముల్కనూర్ సహకార పరపతి సంఘం 69వ వార్షిక మహాసభ వేడుకలు జరుగుతున్నాయి.

Similar News

News September 19, 2025

నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువే: MLA

image

రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువే అని MLA కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలో మాట్లాడుతూ.. తాను ఎవరి దగ్గర మోకరిళ్లే వ్యక్తిని కాదని, కడియం శ్రీహరి ఎప్పుడూ ఐకాన్‌గానే ఉంటారని అన్నారు. తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే కృషి చేశానని అన్నారు.

News September 19, 2025

HYD: ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ స్క్రీనింగ్ కమిటీ భేటీ

image

HYDలో ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ స్క్రీనింగ్ కమిటీ ఈరోజు భేటీ అయ్యింది. ఈ స‌మావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని అధికారులకు కీలక సూచనలు చేశారు. పలు ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లపై చర్చ జరుగుతోంది. తెలంగాణ టూరిజాన్ని దేశవ్యాప్తంగా ఫేమస్ చేయాలని, టూరిజం ద్వారానే మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.