News September 19, 2025

HYD: అమరవీరుల స్థూపం నుంచే పూల పండుగ

image

ఈ నెల 30న జరగనున్న గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. TG అమరవీరుల స్మారక చిహ్నం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2,500 మంది స్వయం సహాయక బృందాల మహిళలు బతుకమ్మలతో ర్యాలీగా బయలుదేరుతారు. కిక్కిరిసిపోయిన బతుకమ్మ ఘాట్ ఒక్కసారిగా కళకళలాడుతుంది. వీరికి స్వాగతం పలికేందుకు ఆకాశం నుంచి పూల వర్షం కురవనుంది. 2 టన్నుల పూలను హెలికాప్టర్ ద్వారా వెదజల్లి, బతుకమ్మ పండుగకు సరికొత్త అనుభూతిని తీసుకురానున్నారు.

Similar News

News September 19, 2025

నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువే: MLA

image

రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువే అని MLA కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలో మాట్లాడుతూ.. తాను ఎవరి దగ్గర మోకరిళ్లే వ్యక్తిని కాదని, కడియం శ్రీహరి ఎప్పుడూ ఐకాన్‌గానే ఉంటారని అన్నారు. తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే కృషి చేశానని అన్నారు.

News September 19, 2025

HYD: ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ స్క్రీనింగ్ కమిటీ భేటీ

image

HYDలో ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ స్క్రీనింగ్ కమిటీ ఈరోజు భేటీ అయ్యింది. ఈ స‌మావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని అధికారులకు కీలక సూచనలు చేశారు. పలు ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లపై చర్చ జరుగుతోంది. తెలంగాణ టూరిజాన్ని దేశవ్యాప్తంగా ఫేమస్ చేయాలని, టూరిజం ద్వారానే మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.